Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

లిప్‌లాక్‌పై వివాదం!

Ranbir-And-Katrina

కొన్ని నెలల క్రితం వరకు బాలీవుడ్‌లో రణబీర్‌కపూర్-కత్రినాకైఫ్‌లు ప్రేమ జంటగా ఎంతో సందడి చేశారు. ఆన్‌స్క్రీన్‌పైనే కాదు ఆఫ్‌స్క్రీన్‌లోనూ రొమాన్స్ పండించేశారు. ఏమైందో కానీ అకస్మాత్తుగా ఈ ఇద్దరు విడిపోయారు. అప్పటి నుంచి ఓ బాలీవుడ్ సినిమా సంక్షోభంలో పడిపోయింది. రణబీర్-కత్రినాల బ్రేకప్ కారణంగా అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘జగ్గా జాసూస్’ మూవీ రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. కానీ ఓ పోస్టర్ విషయంలో కత్రినా, అనురాగ్‌ల మధ్య వివాదం తలెత్తిందట. కత్రినాకు రణబీర్ లిప్‌లాక్ చేసే ఈ పోస్టర్‌ను విడుదల చేయడానికి వీల్లేదని ఖరాఖండీగా చెప్పిందట కత్రినా. సినిమాలో కూడా ఆ సీన్ ఉండడానికి వీల్లేదన్నది ఆమె వాదన. ఈ విషయంపై కత్రినాను సర్దిచెప్పడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాడు అనురాగ్ బసు. అంతేకాదు ఈ ముద్దు సీన్‌కు సినిమా ప్రమోషన్‌లకు కూడా లింక్ పెడుతోందట కత్రినా. ఇన్ని వివాదాలను దాటుకొని అసలు ఈ మూవీ రిలీజ్ అవుతుందా అనే సందేహం కలుగుతోంది. కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ఏడాది జూలై 14న ‘జగ్గా జాసూస్’ చిత్రాన్ని రిలీజ్ చేస్తామంటున్నారు నిర్మాతలు. అప్పటికి సినిమాలో ఎన్ని సీన్లు ఉంటాయో… ఎన్ని ఎగిరిపోతాయో చూడాల్సిందే.

Comments

comments