Home జాతీయ వార్తలు రేప్ కేసులో దోషుల నిర్ధారణ

రేప్ కేసులో దోషుల నిర్ధారణ

RAPEకోల్‌కతా : పశ్చిమ బంగ రాజధాని కోల్‌కతాలో 2012లో జరిగిన పార్క్‌స్ట్రీట్ రేప్ కేసులో గురువారం కోర్టు ముగ్గురిని దోషులుగా నిర్ధారించింది. శుక్రవారం వీరికి కోర్టు శిక్షను ఖరారు చేయనుంది. 2012 ఫిబ్రవరి 6న పార్క్‌స్ట్రీట్ ప్రాంతంలో ఓ మహిళను కారులో ఎక్కించుకుని, తుపాకీతో బెదిరించి ఐదుగురు అత్యాచారం చేశారు. ఈకేసులో ఐదుగురు వ్యక్తులపై ఛార్జిషీటు దాఖలైంది. కేసులో కీలక నిందితుడిని ఇంకా పట్టుకోలేదు. ఘటన జరిగిన 15నెలల తరువాత 2013జూన్‌లో అత్యాచార బాధితురాలు టివిలో ప్రసారమైన సత్యమేవజయతే కార్యక్రమంలో తనపై జరిగిన అత్యాచారం గురించి వెల్లడించింది. బాధితురాలి నుంచి ఆమె సామాజిక కార్యకర్తగా మారారు. 2014లో కోల్‌కతాలోని ఓ రెస్టారెంట్‌లోకి ఆమెను రానీయకపోవడంతో ఈ ఘటనపై పెద్ద దుమారం రేగింది. 2015 మార్చిలో ఆమె అనారోగ్యంతో మరణించారు.