Home మంచిర్యాల కోల్‌బెల్ట్‌లో కూల్‌గా..!

కోల్‌బెల్ట్‌లో కూల్‌గా..!

money*విచ్చలవిడిగా ప్రైవేట్ ఫైనాన్స్‌లు
*అధిక వడ్డీతో సింగరేణి కార్మికుల నిలువుదోపిడీ
*రూ. 3 నుంచి రూ.10 వడ్డీ వసూలు – చోద్యం చూస్తున్న అధికారులు

మనతెలంగాణ/మంచిర్యాల ప్రతినిధి: కోల్‌బెల్ట్‌లో విచ్చలవిడిగా ప్రైవేట్ ఫైనాన్స్‌లను ఏర్పాటు చేసి, అధిక వడ్డీతో సింగరేణి కార్మికులను నిలువుదోపిడి చేస్తున్నా సంబంధిత అధికారులు ప్రైవేట్ ఫైనాన్స్‌లపై ఎలాంటిచర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నా యి. ఈ ప్రాంతంలో సింగరేణి కార్మికులు రెక్కలు ముక్కలు చేసుకొని బొగ్గు గనుల్లో పనిచేసి, అత్యవసర అవసరాలు, పిల్లల చదువులకోసం ప్రైవేట్ ఫైనాన్స్‌ల నిర్వాహకు లను ఆశ్రయి స్తుండగా వారు నిబంధనల ప్రకారం.పూర్తిగా అగ్రిమెంట్ చేయించుకొని ఇష్టా రాజ్యంగా వడ్డీని వసూలు చేస్తు న్నారు. జిల్లా కేంద్ర మైన మంచిర్యాలలో దిన దినానికి ప్రైవేట్ ఫైనాన్స్‌లు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. జిల్లాలో వడ్డీ వ్యాపారు ల దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా కొన సాగుతోంది. కార్మికుల అవసరాలను అదనుగా భావిం చిన వడ్డీ వ్యాపారులు కార్మికుల నడ్డి విరు స్తున్నారు. సింగరేణి కార్మికులనే ప్రధానంగా టార్గెట్ చేసుకొని వ్యాపారాన్ని యధేచ్చగా కొనసాగి స్తు న్నారు. జిల్లా కేంద్రంలో చిన్న, పెద్ద ప్రైవేట్ ఫైనాన్స్ లు కలిపి దాదాపు 200 పైగానే ప్రైవేట్ ఫైనాన్స్‌లను కొనసాగిస్తున్నారు. కార్మికుల అవస రాలను బట్టి రూ.3నుంచి రూ. 10వరకు వడ్డీ వసూలు చేస్తున్నా రని కార్మికులు వాపోతున్నారు. అయితే తప్పని పరిస్థితుల్లో  వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తే భూములు, ఇండ్ల హక్కుల పత్రాల తోపాటు ఖాళీ బాండ్ పేపర్లు, ప్రాంసరీ నోట్లు, ఖాళీ చెక్కులు తీసుకొని  వారి అగ్రిమెంట్‌పై సంతకాలు చేసుకొని అప్పులు ఇస్తున్నారు. ప్రభుత్వ పరంగా ఎలాంటి అనుమతులను పొందకుండా  దర్జాగా కార్యాలయాలను ఏర్పాటు చేసుకొని వడ్డీ వ్యాపారాలను   నిర్వహిస్తున్నారు. కార్మికులు  ఒక నెల వారు తీసుకున్న వాయిదా డబ్బులు చెల్లించక పోతే వడ్డీకి మళ్లీ చక్రవడ్డీ వేసి, కార్మికుల నుంచి అధనంగా డబ్బులను  వసూలు చేస్తున్నారు. లేని పక్షంలో కార్మికు లు ఇచ్చిన ఖాళీ చెక్కులను బ్యాంక్‌లో వేసి, చెక్ బౌన్స్ కేసుల్లో ఇరికించి జైళ్లకు పంపించిన సంఘటనలు కూడా లేకపోలేదు.  అప్పులు తీసుకున్న కార్మికుల నుండి దాదాపు 20 శాతం వడ్డీని  ఎక్కువగా వసూలు చేస్తూ వారిని నిలువు దోపిడికి గురి చేస్తున్నారు.  కొందరు మధ్య తరగతి  ప్రజలు కూడా  వారి పిల్లల చదువుల కోసం  ప్రైవేట్ ఫైనాన్సుల వద్ద వేలాది రూపాయలు  అప్పులు తీసుకొని వడ్డీలు చెల్లించలేక పోతున్నారు.  వడ్డీ భారాన్ని మోయలేక తీసుకున్న అప్పు డబ్బులు తిరిగి చెల్లించలేక  నానా యాతనలకు గురువుతున్నారు.  ప్రైవేట్ ఫైనాన్స్‌లలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు  సింగరేణి ఉన్నత అధికారులు, మరికొందరు  బడా వ్యాపారులు సిండికేట్‌గా మారి  ప్రైవేట్ ఫైనాన్స్‌లను నిర్వహిస్తున్నారు.  ప్రతి నెల కోట్లలో సాగుతున్న  ప్రైవేట్ ఫైనాన్స్‌ల వ్యాపారంపై అధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా  ప్రైవేట్ ఫైనాన్స్‌ల నిర్వాహకులపై పూర్తి స్థాయిలో విచారణ జరిపినట్లయితే ఎన్నో అక్రమాలు వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయి.అక్రమంగా సాగుతున్న  ప్రైవేట్ ఫైనాన్స్‌ల వెనుక కొందరు అధికార పార్టీనేతల హస్తం ఉండడంతో పోలీసులు గాని, సంబంధిత  అధికారులు గాని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా  అధికారులు నిబందనలకు విరుద్ధంగా  నడుస్తున్న  ప్రైవేట్ ఫైనాన్స్‌లపై చర్యలు తీసుకోవాలని కార్మికులుకోరుతున్నారు.