Home అంతర్జాతీయ వార్తలు పాక్, ఆఫ్ఘనిస్థాన్‌లకు సహకారం

పాక్, ఆఫ్ఘనిస్థాన్‌లకు సహకారం

SUSHAMAఇస్లామాబాద్ : పొరుగు దేశాలైన ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్‌లకు వాణిజ్య పరంగా పూర్తి సహకారం అందిస్తామని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. బుధవారం ఇస్లామాబాద్‌లో జరిగిన హార్ట్ ఆఫ్ ఏసియా సదస్సులో ఆమె మాట్లాడారు. మూడు దేశాలూ పరస్పర అవగాహనకు వచ్చి ప్రాంతీయ వాణిజ్యాన్ని అభివృద్ధి చేసుకోవడం ద్వారానే మార్పు సాధ్యపడుతుందన్నారు. ఆఫ్ఘనిస్థాన్ ట్రక్కుల్ని పంజాబ్‌లోని అత్తారీ సరిహద్దుల వద్ద అనుమతించేందుకు సిద్ధంగా ఉన్నామని సుష్మాస్వరాజ్ తెలిపారు. వాణిజ్యం, రవాణా, ఇంధన వనరులు, కమ్యూనికేషన్ రూట్లు తదితర అంశాల్లో పొరుగు దేశాలతో పరస్పర అవగాహన ద్వారా మెరుగుపరుచుకోవాలన్నదే భారత్ లక్ష మని ఆమె స్పష్టం చేశారు.