Home హైదరాబాద్ మీర్‌పేటలో అలరిస్తున్న…‘హస్త‘ కళామేళా

మీర్‌పేటలో అలరిస్తున్న…‘హస్త‘ కళామేళా

image

కాటన్, సిల్క్ ఎక్స్‌ఫో 2017 అరుదుగా లభించే కళాకృతుల ప్రదర్శన ప్రోత్సాహం, ప్రజాధరణ కోల్పోతున్న కళాకృతులు
నేటి యుగంలో యంత్రాలతోనే పని అగ్గిపెట్టెలో పట్టే చీరలు నేయడం అద్భుత కళ

మన తెలంగాణ/బాలాపూర్: భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాల మేళవింపు, చేనేత వస్త్రాల కళాకారుల శ్రామికమైన జీవన సౌందర్యానికి ప్రతీకలు చేనేతలు. దేశ సంస్కృతిలో అంతర్భాగమైన హస్తకళలు చేనేత వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాధానం ఉండేది. అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీరలను మలిచిన అద్భుతమైన కళా నైపుణ్యాన్ని చాటి చెప్పిన మన సంస్కృతిని చేనేత హస్తకళా కారులు నేటి, నాటి ప్రభుత్వాల ప్రోత్సహంలేక ప్రజాదరణ కోల్పొవడం మూలంగా ఎంతో మంది కళాకారులు ‘జీవనోపాధి’ కోల్పోతున్నారు. ఈ తరం యాంత్రిక యుగంలో యంత్రాలతో వేగవంతంగా రూపొందించి పాశ్చాత్య విష సంస్కృతికి బలైపోకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిమీద ఉంది.

ప్రజల కోరికపై మీర్‌పేటకు మరోసారి : గత సంవత్సరం స్వయంకృషి, కృషి రూరల్ డెవలప్‌మెంట్ ఉమెన్ వెల్ఫేర్, వికలాంగుల చేయూత, చేనేత, హస్తకళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మీర్‌పేట ఓపెన్ గ్రౌండ్‌లో అఖిల భారత హస్తకళా మేళా, కాటన్ సిల్క్ ఎక్స్‌పో 2017 ప్రదర్శన, సెల్స్ అత్యంత వైభవంగా కొనసాగింది. తిరిగి ఇక్కడి ప్రజల కోరిక మేరకు మీర్‌పేట ఓపెన్ గ్రౌండ్స్‌లో హస్తకళలు, చేనేత వస్త్రాములు, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అరుదుగా లభించే కళాకృతుల ప్రదర్శన, అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. చేనేత వస్త్రాలు, పోచంపల్లి, చీరలు, డ్రస్ మెటీరియల్స్, మంగళగిరి శారీస్, డ్రస్ మెటీరియల్స్, కళంకారి, గాద్వాల్, వెంకటగిరి, జెర్సీ చీరలు, వరంగల్ టవర్స్, దరీస్, హైదరాబాద్ కాటన్ శారీస్, ఎంబ్రాయిడరీ శారీస్, బెంగాల్ కాటన్ చీరలు, జైపూర్ స్కట్స్, టాప్స్, జెషీట్స్, సోఫా కవర్స్, కట్ వర్క్స్, చిన్న పిల్లల డ్రసెస్స్, బంజార ఎంబ్రాయిడరీస్, ఉప్పాడ జెర్రి శ్యారీస్. వందలది రకాల వస్త్రాలను ప్రదర్శనలో ఉంచారు. ఇష్టమైన వారు సరసమైన ధరల్లో ఖరీదు చేసుకుని సొంతం చేసుకోవచ్చు.
హస్తకళలు : కొండపల్లి బొమ్మలు, ఏటి కొప్పాక బొమ్మలు, హైదరాబాద్ మంచి ముత్యాలు, ఖాదీ గ్రామోద్యోగ్ ఆయుర్వేద ఔషదాలు, లెదర్ బ్యాగ్‌లు, జ్యూట్ బ్యాగులు, ఇమిటేషన్ జ్యూయలరీ, టెర్రకోటా మట్టిబొమ్మలు, షహరాపూర్ ఉడెన్ లాకర్ వేర్, మైసూర్ రోజ్‌వుడ్ ఫ్యానల్స్, ఆగరబత్తీలు, వెదుదు, వేణువులు, కళాత్మాక ఆభరణములు, ఇతరత్రా అనేక వస్తువులు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రదర్శన, అమ్మకాలు కొనసాగుతాయి. ప్రదర్శనకు ఉచిత ప్రవేశం. పూర్తి వివరాలకు కార్యదర్శి ఎం.లిగం యాదవ్, సెల్‌ః 9640520699లో సంప్రదించవచ్చు.