Home తాజా వార్తలు పోలీసుల కోసం ‘ కాప్ కనెక్ట్ ’ : డిజిపి

పోలీసుల కోసం ‘ కాప్ కనెక్ట్ ’ : డిజిపి

'Cop Connect' for Police : DGP

హైదరాబాద్ : తెలంగాణలో పోలీసు వ్యవస్థను బలోపేతం చేసేందుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నామని డిజిపి ముదిరెడ్డి మహేందర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణను నేర రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకే కాప్ కనెక్ట్ పేరిట ప్రత్యేక యాప్‌ను రూపొందించామని ఆయన పేర్కొన్నారు. కాప్ కనెక్ట్‌ను సోమవారం డిజిపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 63వేల మంది పోలీసులకు ఒకేసారి సమాచారం ఇచ్చేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు.

వాట్సాప్ ద్వారా పోలీసు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశామన్నారు. కాప్ కనెక్ట్ యాప్ ద్వారా ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుళ్ల వరకు సమాచారం చేరవేసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. పోలీసు శాఖలోని 17 విభాగాల్లో కాప్ కనెక్ట్ ద్వారా అనుసంధానం కావొచ్చని ఆయన చెప్పారు. ఈ యాప్‌లో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కూడా ఉందన్నారు. 638 పోలీసు స్టేషన్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించొచ్చని తెలిపారు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు పోలీసులు కృషి చేయాలని ఆయన సూచించారు. పోలీసులు ప్రజలతో స్నేహపూర్వకంగా మెసులుతూ, శాంతి పరిరక్షణలో వారిని భాగస్వాములను చేయాలని ఆయన కిందిస్థాయి పోలీసులకు సూచించారు.

‘Cop Connect’ for Police : DGP