Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

ర్యాంకుల కోసం రాంగ్‌రూట్

Checking-in-SSC-Exams

నాగర్‌కర్నూల్ ప్రతినిధి: కొన్ని కార్పొరేట్ పాఠశాలల ర్యాంకుల ఆరాటం కాస్తా రాంగ్‌రూట్ పడుతున్నది. తమ పాఠశాలే గొప్ప అనిపించుకోవాలన్న ఆతృత పాఠాలు చెప్పటం వరకే పరిమితం కాకుండా పక్కదారుల్లో తమ పిల్లలకు ర్యాంకులు సాదించి పాఠశాలలకు పబ్లిసి టి పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయన్న ఆరోప ణలున్నాయి. పదవ తరగతి పరీక్షల్లో మాస్‌కాపీకి కొన్ని కార్పోరేట్ పాఠశాల ప్రయత్నాలను ఆలస్యం గా పసిగట్టిన అధికారులు ఒక్క సారిగా అప్రమత్తమ య్యారు.‘మనతెలంగాణ పత్రికలో వచ్చిన మ..మ.. మాస్ కాపీయింగ్’అన్నవార్తకు స్పందించారు. ఇటు విద్యాశాఖాదికారులు, పోలీసులు కూడా బుధ వారం నిక్కచ్చిగా వ్యవహరించి కాపీరాయుళ్ల ఆటల కు అడ్డుకట్ట వేశారు. జిల్లా కేంద్రంలో మొత్తం 8 పరీక్షా కేంద్రాలుండగా ఇందులో ఒకటి సప్లమెం టరీ విద్యార్థులకోసం కెటాయించడం జరిగింది.

నిన్నటిదాకా విచ్చల విడిగా గోడలు దూకి జవాబు పత్రాలను పరీక్షా గదుల్లోకి యదేశ్చగా వేయగల్గిన వారికి చెక్ పెట్టగలిగారు పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు పెంచారు. అటుగా వెలుతున్న వాహ నాలతో పాటు అనుమానం ఉన్నవారిని కూడా తనఖీలు చేసారు. పరీక్షా సమయంలో పట్టణం లోని జిరాక్స్ సంటర్లు మూసివుంచినా రాంనగర్ కాలనీలోని ఓఇంటినుండా జవాబుపత్రాల జిరాక్స్ లు వస్తున్నట్లు అదికారులు అనుమానించారు. ఆప్రాంతంలోకూడా నిఘా పెంచారు. పలు పరీక్షా కేంద్రాలలో స్పెషల్ స్కాడ్‌తోపాటు సిట్టింగ్ స్కాడ్ ను కూడా రంగంలోకి దించడంతో నిన్నటిదాకా కొనసాగిన విచ్చల విడితనానికి బ్రేక్ పడింది. కాగా కాపీచేసేవారితోపాటు సహకరించే వారిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసే పరిస్థితి ఉండటంతో ఇన్విజిలేటర్లు కూడా విధినిర్వహణలో అప్రమత్త మయ్యారు.

23కేంద్రాల తనిఖీ…

బుధవారం జిల్లాలోని వివిధ ప్రాంతాలలో గల 23పరీక్షా కేంద్రాలను అధికారుల తనఖీ చేశారు. ఇందులో జిల్లా విద్యాధికారి 9కేంద్రాలను తనిఖీ చేయగా ,ఫ్లైయింగ్ స్కాడ్‌లు 14 సంటర్లును తనిఖీ చేశారు. బుదవారం జరిగిన ఇంగ్లీష్ రెండవ పేపర్ కు జిల్లా వ్యాప్తంగా 10686 విద్యార్థులు పరీక్షలకు హాజరుకావల్సి ఉండగా 10652 మంది విద్యార్థులు హాజరయినట్లు డిఇఓ జనార్ధన్ రావ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని అన్ని సంటర్లను డిఇఓ స్వయం గా తనిఖీలు చేశారు.

Comments

comments