Home తాజా వార్తలు ఆజాద్‌నగర్‌లో కార్డన్ సెర్చ్

ఆజాద్‌నగర్‌లో కార్డన్ సెర్చ్

Cordon Search in Azad Nagar

హైదరాబాద్ : హైదరాబాద్ నగరం పరిధిలోని ఆజాద్‌నగర్‌లో శనివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఆరుగురు రౌడీషీటర్లతో పాటు 23 మంది అనుమానితులను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. సరైన ధ్రువపత్రాలు లేని 30 వాహనాలను సీజ్ చేసినట్టు వారు తెలిపారు. తమతమ ప్రాంతాల్లో అనుమానాస్పద స్థితిలో సంచరించే వ్యక్తుల గురించి సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Cordon Search in Azad Nagar