Home తాజా వార్తలు భద్రాచలంలో నిర్బంధ తనిఖీలు

భద్రాచలంలో నిర్బంధ తనిఖీలు

TS-Police-Logo

ఖమ్మం: భద్రాచలంలో గురువారం ఉదయం పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఎస్‌పి సంగ్రామ్ సింగ్ గణపతిరావు పాటిల్ ఆధ్వర్యంలో సిఐ సత్యనారాయణ రెడ్డి, 10 మంది ఎస్‌ఐలు, 200 మంది పోలీస్ సిబ్బంది సోదాలలో పాల్గొన్నారు. సరైన పత్రాలు లేని 12 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పలువురి అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.