Home తాజా వార్తలు మాదాపూర్‌లో కార్డన్ సెర్చ్

మాదాపూర్‌లో కార్డన్ సెర్చ్

Cordon Search in Madhapur

హైదరాబాద్ : మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అయ్యప్ప సొసైటీ, సాయినగర్, జైహింద్ కాలనీ, పత్రికా నగర్, విఠల్‌రావు నగర్‌లో కార్డన్ సెర్చ్ నిర్వహించినట్టు డిసిపి వెంకటేశ్వరరావు తెలిపారు. సెర్చ్ సందర్భంగా సరైన ధృవపత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు.

Cordon Search in Madhapur