Home తాజా వార్తలు మాణికేశ్వర్‌ నగర్‌లో కార్డన్ సెర్చ్

మాణికేశ్వర్‌ నగర్‌లో కార్డన్ సెర్చ్

Cordon Search in Osmania Hospital by East zone Police
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని మాణికేశ్వర్ నగర్ లో పోలీసులు మంగళవారం సాయంత్రం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈస్ట్ జోన్ మండలం డిసిపి రమేష్ ఆధ్వర్యంలో 175 మంది పోలీస్ సిబ్బంది ఈ సోదాల్లో పాల్గొన్నారు. ఈ తనిఖీల్లో ఐదుగురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా డిసిపి రమేష్ మాట్లాడారు. వదంతుల ప్రచారాన్నిఎవరూ నమ్మవద్దని సూచించారు. వదంతులపై అవగాహన కల్పించడానికే తనిఖీలు జరిపామని స్పష్టం చేశారు. కరపత్రాలు, ప్లెక్సీలు, బ్యానర్లు ద్వారా ప్రజల్లో  అవగాహన కల్పిస్తున్నామని డిసిపి రమేశ్ తెలిపారు.