Home తాజా వార్తలు ఉస్మానియా ఆస్పత్రిలో కార్డన్ సెర్చ్…

ఉస్మానియా ఆస్పత్రిలో కార్డన్ సెర్చ్…

CRDEN

హైదరాబాద్: మొదటిసారిగా ఉస్మానియా దవాఖానాలో ఈస్ట్ జోన్ పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. 100 మంది సిబ్బందితో కలిసి ఆసుపత్రి మొత్తాన్ని తనిఖీ చేపట్టారు. రోగులు, వారి సహాయకుల వివరాలను పోలీసులు తెలుసుకున్నారు.  ఈ క్రమంలో పలువురు ఇన్సురెన్స్ బ్రోకర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. రోగులకు మాయ మాటలు చెప్పి మోసం చేసే మరికొందరు దళారులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. యాక్సిడెంట్ కేసుల్లో ఇన్సురెన్స్ ఇప్పిస్తామని రోగులను ఇన్సురెన్స్ బ్రోకర్లు మోసం చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.