Home తాజా వార్తలు రామగుండంలో నిర్బంధ తనిఖీలు

రామగుండంలో నిర్బంధ తనిఖీలు

TS-Police-Logo

పెద్దపల్లి: రామగుండం ఎన్‌టిపిసి శివారులో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. గోదావరిఖని ఎసిపి రక్షిత కె.మూర్తి ఆధ్వర్యంలో ఎన్‌టిపిసి సిఐతో పాటు ఎస్‌ఐలు, 100 మంది పోలీసులు సోదాలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 22 ద్విచక్రవాహనాలు, రూ.10 వేల విలువైన మద్యంను స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు అనుమానితులను  అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.