Home తాజా వార్తలు భగత్‌సింగ్ నగర్‌లో నిర్బంధ తనిఖీలు

భగత్‌సింగ్ నగర్‌లో నిర్బంధ తనిఖీలు

TS-Police-Logo

హైదరాబాద్: సరూర్‌నగర్ పరిధి భగత్‌సింగ్ నగర్‌లో శనివారం తెల్లవారుజామున పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఎల్‌బి నగర్ డిసిపి వెంకటేశ్వర్ రావు ఆధ్వర్యంలో 300 పోలీసులు ఈ తనిఖీలలో పాల్గొన్నారు. ఎలాంటి పత్రాలు లేని 59 బైక్‌లు, 23 ఆటోలు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. 250 లిక్కర్ సీసాలు స్వాధీనం చేసుకొని, 16 మంది అనుమానితులు, నేరస్థులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.