Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

కమీషనర్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్

 Cordon Search under the Commissioner

మన తెలంగాణ/హుస్నాబాద్ : పట్టణంలోని ఎల్లమ్మ బజార్‌లో సోమవారం రోజున సిద్దిపేట జిల్లా కమిషనర్ జోయల్ డేవిడ్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కాలనీలో ఉదయం 5 గంటలకే ప్రారంభమైన ఈ సెర్చ్‌లో సరైన ధృవపత్రాలు లేని 64 ద్విచక్ర వాహక్రవాహనాలు, 13 ఆటోలు అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అందులో కొన్ని ధృవ పత్రాలు లేని 48 వాహనాలకు మోటర్ వాహన చట్టం ప్రకారం 13,200 జరిమానా విధించామన్నారు. ఇతర వాహనాలపై కేసులు నమోదు చేశామన్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాల యజమానులు వాటి ధృవపత్రాలు చూపించి వాహనాలను తీసుకోవాలని, వాహనాల డాక్యుమెంట్లు లేకుండా వాహనాలు నడపరాదని హెచ్చరించారు. ఒక వేళ నడిపినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి కార్డన్ సెర్చ్‌లు ఇక నుండి తరచుగా జరుపుతామని తెలిపారు. ఈ కార్డన్ సెర్చ్ వల్ల ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం ఉందన్నారు. ప్రతీ వాహనదారుడు ఖచ్చితంగా ఆర్.సి, ఇన్సూరెన్స్, పొల్యూషన్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని వారికి సూచించారు. కాలనీలలో ఎవరైనా అనుమానాస్పదంగా కన్పించినట్లయితే వెంటనే పోలీసులకు తెలియచేయాలన్నారు. గ్రామాలలో ఉన్న యువకులు చెడు అలవాట్లకు బానిసలకు అలవాటు పడకుండా బుద్ధిగా చదువుకుని తల్లి తండ్రులకు, వారి ప్రాంతాలకు మంచి పేరుతీసుకురావాలని సూచించారు. పోలీసులు విధులు నిర్వహించేది ప్రజలను రక్షించడానికే అన్నారు,  ఈకార్డెన్ సర్చ్‌లో డి.సి.పి నరసింహ, ఎసిపి మహేందర్ , సిఐ శ్రీనివాస్ జి, హుస్నాబాద్ ఎస్‌ఐ దాస సుధాకర్, అక్కన్నపేట ఎస్‌ఐ పాపయ్య నాయక్ , కోహెడ ఎస్ కోట సతీష్

Comments

comments