Search
Wednesday 21 November 2018
  • :
  • :

పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు

Corporate level medical services to the poorప్రతి యేడాది ప్రతి ఒక్కరికి ఆరోగ్య పరీక్షలు
రాష్ట్ర వ్యాప్తంగా 35 డయాలసిస్ సెంటర్లు ప్రారంభించాం
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లకా్ష్మరెడ్డి

మనతెలంగాణ/కరీంనగర్‌ప్రతినిధి/గోదావరిఖని: అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ కు దీటుగా అభివృద్ధి చేసి పేద రోగులందరికి కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లకా్ష్మరెడ్డి అన్నారు. సోమవారం నగరంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి 3 అర్బన్ హెల్త్ సె ంటర్లు, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డ యాలసిస్ సెంటర్, ఉద్యోగుల, ఫించన్ దారుల, జర్నలిస్టులకు ఏర్పాటు చేసిన వెల్‌నెస్ సెంటర్‌ను ప్రారంభించారు. రాంనగర్‌లో ఆయుష్ 20పడకల ఆసుపత్రికి మంత్రి శం కుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మాతా శిశు ఆరోగ్య కేం ద్రంలోఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందు కు వెళ్తుందని అన్నారు. పేద, సామాన్య ప్రజలకు ఆరోగ్య పరిరక్షణకు ఉత్తమ వైద్య సేవలు అందిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, తె లంగాణ వచ్చిన తర్వాత గత నాలుగు సంవత్సరాలలో వై ద్య శాఖను పూర్తిగా ప్రక్షాళన చేసి ఎన్నో మార్పులు తెచ్చామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అ ందిస్తున్నామని, కరీంనగర్‌కు మొదటిసారిగా వచ్చినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసియూ యూనిట్ ఎక్కడ అంటే ఆ సుపత్రిలో లేదని చెప్పారని, దీనివల్ల పేద ప్రజలు సుదూర ప్రాంతాలకు అత్యవసర వైద్య సేవలకు వెళ్లే మార్గ మధ్యంలో నే చనిపోయే వారిని అన్నారు.కరీంనగర్ ఆసుపత్రిలో ఐసియూ సెంటర్,డయాలసిస్ సెంటర్,ల్యాబ్, ప్రసూతి ఆ సుపత్రి మొదలగునవి అన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

రాష్ట్రంలో 40డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశామని, అందులో భాగంగా కరీంనగర్‌లో సోమవారం ప్రారంభి ంచామని తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని ఏరియా ఆసుపత్రులలో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని,కరీంనగర్‌లో ఇంకా రెండు అర్బన్ హెల్త్ సెంటర్లు కా వాలని అడిగారని వాటిని కూడా త్వరలో ప్రారంభిస్తామని మంత్రి అన్నారు. రాష్ట్రంలో 1500ల బస్తీ దవాఖానాలు ఏ ర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ బస్తీ దవాఖానాలతో ఆ బస్తీలో ఉన్న పేద ప్రజలకు వైద్య సేవలు అందుతాయని తె లిపారు.రాష్ట్రంలో 5ఆయుష్ ఆసుపత్రులు మంజూరు అ య్యాయని అందులో ఒకటి కరీంనగర్‌లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.వైద్య రంగంలో అలోపతితో పాటు ఆ యుర్వేదం,యునాని,హోమియో రంగాన్ని కూడా అభివృ ద్ధి చేస్తున్నామని తెలిపారు.వెల్‌నెస్ సెంటర్టు రాష్ట్రంలో 14 ఏర్పాటు చేయడానికి నిర్ణయించామని,కరీంనగర్‌లో 5వ వెల్‌నెస్ సెంటర్‌ను ప్రారంభించుకున్నామని తెలిపారు. అ న్నిపాత జిల్లా కేంద్ర స్థానాలలో వెల్‌నెస్ సెంటర్లను ఏర్పా టు చేస్తామని తెలిపారు.మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైద్యరంగంలో విప్లవాత్మ క మార్పులు వచ్చాయని, విద్య,వైద్యం సామాన్య ప్రజానికానికి అందుబాటులో ఉంచడమే ప్రభుత్వ లక్షమని అ న్నారు.గత ప్రభుత్వాలు ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు పెద్ద పీట వేశారని ఆరోగ్య శాఖను నిర్వీర్యం చేశారని అ న్నారు.రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు దేశంలో ఎక్కడా లే ని విధంగా ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్నాదని, సోమవా రం కరీంనగర్‌లో డయాలసిస్ సెంటర్,మూడు అర్బన్ హె ల్త్ సెంటర్లు ప్రారంభించామని,20 పడకల ఆయుష్ ఆసుపత్రికి శంకుస్థాపన చేశామని, త్వరలో కరీంనగర్ జిల్లాకు 750 పడకల ఆసుపత్రి 500 కోట్లతో మంజూరు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాలలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తుల ఉమ. జిల్లా క లెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్,ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎంఎల్‌ఎ గంగుల కమలాకర్, ఐడిసి చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి,నగర మేయర్ సర్దార్ రవీందర్ సింగ్,డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ళపు రమేష్,కార్పొరేటర్లు, జిల్లా వైద్య ఆరో గ్య శాఖాధికారి డాక్డర్ సుజాత తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తున్నాం
తెలంగాణహెల్త్ ప్రొఫైల్‌ను తయారు చేస్తున్నామని, దీంతో ప్రతి ఒక్క కుటుంబం ఆరోగ్యంగాఉండేందుకుఇది దోహదం చేస్తుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లకా్ష్మరెడ్డి అన్నారు. సో మవారం ఆయన పెద్దపల్లి ఎంపి బాల్క సుమన్‌తో కలిసి ప్రభుత్వ ఏరియా ఆ సుపత్రిలో డ యాలసిస్ సెంటర్, భర్తింగ్ రూం నులాంఛన ంగా ప్రారంభించారు. తదనంతరం ఎంఎల్ సోమారపుతో కలిసి క్యాంపు ఆఫీసులో పాత్రికేయులతో మాట్లాడారు.దేశంలోనే తొలిసారి గా నాణ్యమైన డయాలసిస్ సేవలను అందించేందుకు సింగిల్ యూస్ డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీంతో నాణ్యమైన డయాలసిస్ సాధ్యమవుతుందని, కిడ్నీరోగులకు అద్భుతమైన శుద్ధి అయిన ర క్తాన్ని అందించడం సాధ్యమవుతుందని తెలిపారు. కెసిఆర్ సూచన మేరకు రాష్ట్ర వ్యాప్తం గా 40డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చే యాలని నిర్ణయించినట్లు,దీనిలో ఇప్పటికే 35 సెంటర్లను ప్రారంభించినట్లు తెలిపారు. పేద రోగులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతు ందని స్పష్టం చేశారు. లక్షలాది రూపాయలు వృథాచేయాల్సిన అవసరం ఎంతమాత్రం లే దన్నారు.దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ ప్రాంతంలో ఇన్‌ఫెర్టిలిటీ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు.దీంతో లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్న సంతానం లేని దంపతులకు ఉ పయోగపడుతుందన్నారు.
అంతేకాకుండా ప్రధాన ఏరియా ఆసుపత్రిలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిబంధనల ప్ర కారం గర్భిణీలకు లేబర్ రూంలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.అంతేకాకఇంటెన్సివ్ యూ నిట్ కేర్, అధునాతన ఆపరేషన్ ధియేటర్‌ల ను నిర్మిస్తున్నామన్నారు.ఆసుపత్రులలో సేవ లు అందించే వైద్య సిబ్బందికి ఏకరూప దుస్తులను అందిస్తున్నామన్నారు.దీంతో ప్రైవేటు ఆ సుపత్రులకు దీటుగా సేవలు అందించేందుకు వీలుపడుతుందన్నారు.కెసిఆర్ కిట్ పథకంతో ప్రభుత్వఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయన్నారు. తల్లులకు, పిల్లలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని గుర్తు చేశారు. ఆసుపత్రులలో సరైన సిబ్బంది లేని కారణంగా సే వలు ఆలస్యం అవుతున్నాయనే ఆరోపణలు ఖండించేందుకు 10వేల పోస్టులను భర్తీ చేసే ందుకు జీఓ జారీ చేసామని, కొన్ని అనివార్య కారణాల వల్ల ముందుకు సాగలేకపోతున్నామని, త్వరలోనే దానిని అదిగమించి నాణ్యమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు.
త్వరలోనే డీఅడిక్షన్ సెంటర్ల ఏర్పాటుకు కెసిఆర్‌కు వినతి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో మంథని ఎంఎల్‌ఎ పుట్టమధు, రామగుండం కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ రావు, నాయకులు,కార్పొరేటర్లు ముప్పిడి సత్యప్రసాద్, కోదాటి ప్రవీణ్, జాలి రాజమణి, సిం హాచలం మాధవి,దరణి స్వరూప, బాలసాని స్వప్న,బాబుమియా,పాలిత్య రవి నాయక్, కిషన్‌రెడ్డి, మండ రమేష్, దాతు శ్రీనివాస్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments