Home జగిత్యాల నిరుపేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం

నిరుపేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం

Corporate medicine for the poor people

రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ రాజేశంగౌడ్

మనతెలంగాణ/జగిత్యాలటౌన్: గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలు కార్పొరేట్ వై ద్య సేవలు పొందే ఆర్థిక స్థోమత లేక నాటు వైద్యం చేయించుకుంటున్నారని, అ లాంటి వారికి ఉచితంగా కార్పొరేట్ వైద్య సేవలందించేందుకు డాక్టర్లు మానవతా దృక్పథంతో గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఆర్థిక సం ఘం చైర్మన్ గొడిసెల రాజేశంగౌడ్ అన్నారు. రాజేశంగౌడ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తన స్వగ్రామమైన జగిత్యాల మండలం అంతర్గాంలో హైదరాబాద్ జాయ్ ఆసుపత్రి వైద్యుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం రాజేశంగౌడ్ మాట్లాడుతూ, నిరుపేదలకు కా ర్పొరేట్ వైద్యం అందని ద్రాక్షగా మారిందని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమ ంత్రి కెసిఆర్ రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించడంతో పాటు ఉచితంగా వైద్య సేవలందించేందుకు కృషి చేస్తున్నారన్నారు.
లక్షలాది రూపాయలు ఖర్చయ్యే వైద్యాన్ని ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు, వైద్యులు తమ వ ంతుగా నిరుపేదలకు ఉచిత వైద్య సేవలందించేందుకు ముందుకు రావాలని ఆ యన కోరారు.తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన జాయ్ ఆస్పత్రి వైద్యులు రాహూల్‌గాంధీ గౌడ్, డాక్టర్ సతీశ్, డాక్టర్ జ య, డాక్టర్ సృజన, డాక్టర్ హరి విక్రమ్‌గౌడ్‌లను ఆయన అభినందించారు. ఈ కా ర్యక్రమంలో మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, టిఆర్‌ఎస్ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ సంజయ్‌కుమార్, డాక్టర్ గంగారెడ్డి, సర్పంచ్ నక్కల రాధరవీందర్‌రెడ్డి, పరశురాంగౌడ్, హరి అశోక్‌కుమార్, వాసాల వెంకటేశ్వర్లు, మానాల కిషన్, ఉప సర్పంచ్ మల్లేశం, ఎఎంసి డైరెక్టర్ నారాయణ,తదితరులు పాల్గొన్నారు.