Home జిల్లాలు మారుమూల గ్రామాలకు కార్పొరేట్ 

మారుమూల గ్రామాలకు కార్పొరేట్ 

openingఎంఎల్‌ఎ వంశీచంద్‌రెడ్డి
మన తెలంగాణ/ఆమనగల్లు: ఆర్థిక ఇబ్బందుల మూలంగా సకాలంలో వైద్య సేవలు అందక ఇబ్బందులు పడుతున్న మారుమూల గ్రామాల పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు స్వచ్చంద సంస్థలు, కార్పోరేట్ ఆస్పత్రుల నిర్వాహకులు ముందుకు రావాలని కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి కోరారు. వైద్య రంగంలో నానాటికి చోటు చేసుకుంటున్న ఆదునిక సదు పాయాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. ఆమనగల్లు పట్టణంలోని బస్టాండ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఆపోలో హాస్పిటల్ ,దాత్రి స్వచంద సంస్థ కేశంపేట ఆధ్వర్యంలో స్త్రీలకు ,గర్భిణీ స్త్రీలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి ప్రారంభించారు.డాక్టర్లు విజయ్ కుమార్, రజిని, ఫాతిమా,శిబిరంలో స్త్రీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. జడ్పిటిసి కండె హరిప్రసాద్ ,ఎంపిపి తల్లోజు లలిత వెంకటయ్యలు సందర్శించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు సామాజిక దృక్పథంతో ముందుకు సాగాలన్నారు. సామాజిక సేవ కార్యక్రమాలనిర్వాహణలో స్వచ్చంద సంస్థలు,యుజన సంఘాలు పోటిపడాలన్నారు. ప్రజారోగ్య పరీరక్షణకు ప్రభుత్వ ఆస్పత్రులలో సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్ద పీట వేయాలని వంశీచంద్ రెడ్డికోరారు.ఈ కార్యక్రమంలో దాత్రి స్వచ్చంద సంస్థ కో-ఆర్డినేటర్ ఎమ్.మహేందర్ ఆపోలో హాస్పిటల్స్ కార్పోరేట్ రిలేషన్ మేనేజర్ శ్రీనివాస్ ,ఎంపిటిసి పత్యనాయక్, ఝాన్సీశేఖర్,నాయకులు పాపిశెట్టి రాములు తదితరులు ఉన్నారు.