Home పెద్దపల్లి సామాజిక తనిఖీ ప్రజావేదికలో బయటపడిన అవినీతి

సామాజిక తనిఖీ ప్రజావేదికలో బయటపడిన అవినీతి

100-Days-workకమాన్‌పూర్: పేద కూలీలకు స్థానికం గా ఉపాధి చూపించి, వారు వలస బాట పట్టకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వాలు గత కొన్నేళ్లుగా మహత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి ఆమలు చేస్తుండగా కొంత మంది క్రింది స్థాయి ఉపాధి సిబ్బంది అవినీతి, అక్రమాలకు పాల్పడుతుండంతో ప్రభుత్వ లక్షం ఆశించిన స్థాయిలో నేరవేరడం లేదు. ఇందుకు నిదర్శనమే..కమాన్‌పూర్ మండలంలో ఇటీవల చేపట్టిన 2016 సంవత్సరంలో ఉపాధి హామీ పథకం క్రింద చేపట్టిన పనుల్లో అవినీతి, అక్రమాలు పెద్ద ఎత్తున బయటపడటమని చెప్పవచ్చు. మంగళవారం ఎంపిపి కార్యాలయ ఆవరణలో ఎంపిపి ప్రేమలత అధ్యక్షతన పెద్దపల్లి డిఆర్‌డిఓ అంజయ్య ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ ప్రజావేదికను నిర్వహించారు. ఈ ఉపాధి పనుల్లో పెద్ద ఎత్తున అవకతవకలు, అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించిన డిఆర్‌డిఓ అంజయ్య రొంపికుంట, బేగంపేట, పెంచికల్ పేట క్షేత్ర సహయకులు పులిపాక రమేష్, బద్రి, రాజయ్యలను సస్పెండ్ చేయడంతో పాటు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్లు విలేకరులకు తెలిపారు. రొంపికుంటలో రెండు పంట కాలువల పూడీక తీత పనులు చేయకుండానే బీనామీ కూలీలను పేర్లతో లెబర్ పెమెంట్ క్రింద రూ. 20 వేలకు పైగా క్షేత్ర సహయకుడు పులిపాక రమేష్ కాజేసిట్లు బయటపడింది.

ఇజిఎస్ ప్రతి మస్టర్ రోల్స్‌లో ప్రతి దానిలో హజరులకు సంబంధించి కోట్టి వేతలు ఉండటం గమనిస్తే కోంత మంది క్షేత్ర సహయకులు, మేట్లు పనికి రాని తనతో కుమ్మకైన కోంత మంది కూలీలకు నిత్యం హజర్లు వేస్తూ ఆ వేతనాల మొత్తాన్ని వారితో కలిసి పంచుకున్నట్లు తనిఖీలో తేట తెల్లమయ్యింది. పని ప్రదేశాల్లో హజరైన కూలీల సంతకాలు తీసుకోవాల్సిన క్షేత్ర సహయకుల్లో కోంత మంది తన ఇంటి వద్ద పోర్జరీ సంతకాలతో తనకు నచ్చిన, ఇష్టం వచ్చిన కూలీలు పనికి హజరైనట్లు మస్టర్ రోల్స్ తయారు చేసి, అక్రమాలకు పాల్పడినట్లు తనిఖీ బృందం గుర్తించింది. పనుల కోలతల్లో తేడా, బీనామీ పనులు, మస్టర్లలో హజర్లను దిద్దడం, వైట్ నర్ వాడటంను లాంటి అవకతవకలను తనిఖీ బృందాలు గుర్తించాయి.

గ్రామాల వారీగా రీకవరికి డిఆర్‌డిఓ ఆదేశించిన వివరాలు: పెద్దంపేట, వెంకట్రావుపల్లె ఇజిఎస్ పనులు కొనసాగకపోగా మిగిలిన గ్రామాల్లో గ్రామాల వారీగా డిఆర్‌డిఒ రీకవరీకి ఆదేశించిన అక్రమాలివే.. రొంపికుంటలో రూ. 52673, కమాన్‌పూర్‌లో రూ. 12668, నాగారంలో రూ. 2000, బేగంపేట రూ. 12586, పెంచికల్ పేటలో రూ. 10362, పేరపల్లిలో రూ. 2213, కల్వచర్లలో రూ. 2086, రత్నాపూర్‌లో రూ. 2500, నాగెపల్లిలో రూ. 128, రాణా పూర్‌లో రూ. 3140, కన్నాలలో రూ. 7067, సుందిల్లలో రూ. 1468, ముస్తాలలో రూ. 1629, జల్లారంలో రూ. 3398, గుండారం లో రూ. 2134, జూలపల్లిలో రూ. 1170 మొత్తం కలిపి రూ. 1,17,242లు అక్రమాలు జరిగినట్లు గుర్తించి, రీకవరికి డిఆర్‌డిఓ అంజయ్య ఆదేశించారు.