Home కామారెడ్డి చేపల అవినీతి కంపు

చేపల అవినీతి కంపు

Fish-Scam

బాన్సువాడ: ప్రభుత్వం మత్సకారుల జీవి తాల్లో వెలు గులు నింపాలన్న లక్షంతో ఉచితంగా వి డుదల చేసి న చేప పిల్లల వ్యవహారంతో అవకతవ కలు చోటుచేసుకున్నాయి.నీలి విప్లవంలో అవినీ తి నీడలు కమ్ముకున్నాయి. చెరువులలో చేప పిల్లల విడుదల చాటున అక్రమాలు చోటుచేసుకున్నా యి. భారీ ఎత్తు న అవినీతి అవకాశం క ల్పించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గు త్తేదారులతో సంఘాల ప్రతినిధులు,అమాత్యులు మిలాఖత్ అయ్యారన్న వదం తులు వెల్లువెత్తుతున్నాయి. ఆర్బాటంగా సాగిన ఈ చేప పిల్లల విడుదలలో గుట్టుగా జీరో సైజు చేప పిల్ల లు చొరబడ్డాయి.

వాటి చాటున పెద్దమొత్తంలో కొనుగోల్‌మాల్ జరిగిందన్న విమర్శలున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ప్రజాప్రతి నిధులందరూ వదిలిన చేపపిల్లలలో అవి నీతి చేపలు కూడా జత కలిసి చెరువు ల్లో చేరిపోయాయి. ప్రతి చోట ఈ పరంపర కొనసాగింది. వివిధ సైజు ల చేపలతో పాటు జీరో సైజు చేప పిల్లలను కలిపి చెరువుల్లో విడు దల చేశారు. వాస్తవానికి జీరో సైజు చేప పిల్లలను చెరువులో విడుదల చేసే అవకాశం లేకు న్నప్పటికీ సగానికి సగం చేప లకు చెరువుల్లో విదుదల చేశారు. ప్రభుత్వం కొనుగోళ్లలో ప్రత్యేక దృష్టి సారించినప్పటికీ అక్రమాల కు అవకాశం కల్పించుకున్నారు. మత్సకార్మిక సంఘాల ప్రతినిధులు కూడా ఈ ప్రక్రియకు అండాగా నిలి చారు.

జిల్లాలో చేప పిల్లల విడుదల ఇలా…

జిల్లాలో మత్స సంపదకు అనుకూల అవ కాశాలున్నాయి. అందులో బాగంగా జిల్లా వ్యాప్తంగా 549 రిజర్వాయర్లుండగా, నీటి నిలువ విస్త్రీర్ణం 26,889 హెక్టార్లున్నాయి. జిల్లా లో 162 మత్సకార సంఘాలుండగా, 11,371 మంది సభ్యులు ఉన్నారు. చేపలను విడుదల చేసిన జలశయాలు 170 ఉండగా, మరో 529 చెరువుల్లో చేప పిల్లలను విడుదల చేసినట్లు అధికారిక రికార్డులు తెలుపుతు న్నాయి. 108.4 లక్షలలో చేప పిల్లలను వదిలి పెట్టారు. జిల్లా వ్యా ప్తంగా 529 చెరువుల్లో మూడు కోట్ల 32 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. ప్రతి గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిల్లో ఉన్న అన్ని చెరు వుల్లో చేప పిల్లల విడుదలకు చర్యలు తీసుకున్నారు. అన్ని చెరువుల్లో ప్ర స్తుతం ప్రభుత్వం విడుదల చేసిన చేప పిల్లలు పెరుగుతున్నాయి.

చేప పిల్లల సైజుల్లో మాయాజాలం

ప్రభుత్వం విడుదల చేసిన చేప పిల్లల వ్యవహారంలో పలు అవకతవకలు చోటు చేసుకున్నాయన్న పుకార్లు షికారు చేస్తున్నాయి. చెరువుల్లో చేప పి ల్లలను విడుదల చేసేందుకు గాను గుత్తేదారుల నుండి పిల్లలను ప్రభు త్వం కొనుగోలు చేసింది.అందులో భాగంగా 70 నుంచి 80 ఎంఎం ల సైజులో చేపలను 92 పైసల చొప్పున గుత్తేదారు ధరను ప్రకటించగా, వాటిని అధికారులు రెండు పైసలు తగ్గించి ఒక్కో చేప పిల్లకు 90 పైసల చొప్పున కొనుగోలు చేశారు.తదనంతరం జరిగిన మాయాజాలంలో వాటి తో పాటు మరికొన్ని సైజుల చేప పిల్లలను కూడా కొనుగోలు చేయగా, అందులో జీరో సైజు చేప పిల్లలను కలిపి సరఫరా చేశారు. జీరో సైజుల కు కూడా రేటు కడుతూ ప్రభుత్వ నిధులను నొక్కేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఏడాదికి బయటపడునున్న చేపలు

ప్రస్తుతం ప్రభుత్వ పరంగా జిల్లాలోని అన్ని చెరువుల్లో విడుదల చేసిన చే ప పిల్లలను నిధానంగా ఏడాది దాటాక బయటకు తీస్తారు. అప్పుడు అట్టి చేపల బరువు కిలో నుండి కిలోన్నర వరకు ఉంటుంది. మరికొన్ని చేపలు రెండు కిలోల వరకు బరువుతో పెరుగుతాయి. ఇంకొన్ని చేపలు కిలోకు తగ్గి, లేక కిలో పావు బరువుతో తూకం వస్తాయి. విడుదల చేసే సమ యంలో వేసిన చేప పిల్లల సైజులను బట్టి చేపల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అన్ని చెరువులను కలుపుకోని 3 కోట్ల 32 లక్షల చేపలను విడుదల చేయగా ఏడాది తరువాత అంతే సంఖ్యలో చేపలు బయటకు రావాల్సిన అవసరం ఉంటుంది. కాని ఇప్పుడున్న శ్రద్ధ ప్ర భుత్వానికి అప్పుడుండదన్న ధీమాతో గుత్తేదారులు, మరికొందరు కలిసి కొనుగోలు మాల్ చేశారు.

చెరువుల్లో వేసిన చేపలు ఇవే…

జిల్లాలోని చెరువుల్లో వివిధ రకాల చేపలను విడుదల చేశారు. చెరువలు నీటిని, ఆ ప్రాంత మట్టిని బట్టి చేపల పెంపకానికి చేపలను కేటాయించు కున్నారు. అందులో బాగంగా అన్ని చెరువులలో ఒకేరకమైన చేప పిల్ల లను కాకుండా మూడు రకాల చేప పిల్లలను విడుదల చేశారు. ఈ క్రమ ంలో చెరువుల్లో వేసిన రవ్టా, కట్నా, మిర్గ చేప పిల్లలతో పాటుగా అధిక ధరలతో అమ్ముడుపోయే మొట్ట చేపలను కూడా విదుదల చేసుకున్నారు.

పెద్ద చేపలకు ఆహారంగా జీరో సైజు చేప పిల్లలు..

చెరువుల్లో వేసిన చేప పిల్లలలో జీరో సైజు చేప పిల్లలు పెద్ద చేపలకు అ హారంగా పోతాయి. పెద్ద చేపలు చిన్న జీరో సైజు చేపలను తినేస్తాయి. దీంతో అవి విడుదల చేసిన వెంటనే వాటికి అహారంగా మారడంతో వాటి ఉనికి చెరువుల్లో కనిపించే అవకాశం ఉండదు. ఈ విషయం తెలిసినప్ప టికీ వాటిని వివిద సైజుల చేపలతో కలిసి చెరువుల్లో విడుదల చేశారు.