Home కరీంనగర్ పెద్దపల్లి పత్తి మార్కెట్లో కోట్ల అవినీతి!

పెద్దపల్లి పత్తి మార్కెట్లో కోట్ల అవినీతి!

ప్రభుత్వానికి నివేదిక అందించిన విజిలెన్స్ అధికారులు 

బాధ్యులపై చర్యలకు సిద్ధమవుతున్న సర్కారు
Fireworks_manatelanganaపెద్దపల్లి: పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లలో కోట్లాది రూపాయల అవినీతి జరిగినట్లు గత మూడు నెలల క్రితం విజిలెన్స్ అధికారులు చేసిన తనిఖీలలో బయటపడిన విషయం ప్రభుత్వానికి నివేదిక రూపంలో చేరింది. ఈ అవినీతి కుంభకోణంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల బృందం ప్రభుత్వానికి నివేదిక సమర్పించడంతో పెద్దపల్లి మార్కెట్ అధికారులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

గత సీజన్‌లో రైతుల నుంచి పత్తి కొనుగోళ్లు చేపట్టిన సీసీఐ అధికారులు, అడ్తి వ్యాపారులు కుమ్మక్కయి అక్రమ మార్గంలో కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడి రైతులను దోచుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. తేమ పేరుతో, క్యాష్ కటింగ్, హమాలీల ఛార్జీల తదితర సాకులతోపాటు తక్‌పట్టిల నమోదులో బినామీ పేర్లను చేర్చి రైతులను నిలువు దోపిడీ చేయడంతో రైతులు రోడ్డెక్కి పలు మార్లు ఆందోళనలు, రాస్తారోకోలు చేసిన విషయం విదితమే. రైతులను సీసీఐ అధికారులు, అడ్తిదారులు మోసం చేస్తున్నా మార్కెట్ ఉన్నతాధికారులు పట్టించుకోక పోవడంతో ప్రజా ప్రతినిధులు సైతం మార్కెట్‌ను సందర్శించి రైతులను మోసం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన సందర్భాలు న్నాయి. సీసీఐ అధికారులు బహిర్గతంగానే రైతులను తేమ పేరుతో పత్తి కొనుగోళ్లు చేయక పోవడంతో అడ్తి వ్యాపారులు రంగంలోకి దిగి తక్కువ రేటుకు కొనుగోలు చేసి తిరిగి అదే పత్తిని సీసీఐకి ప్రభుత్వ ధరతో విక్రయించడంతో రైతులు మార్కెట్‌లో మోసపోయారు. శ్రమను నమ్ముకున్న రైతులకు అండగా నిలవాల్సిన అధికారులు దళారుల కొమ్ము కాయడంతో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.

09pdp02knrపెద్దపల్లి పట్టణానికి చెందిన తాడూరి శ్రీమాన్ అనే వ్యక్తి మార్కె ట్‌లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఫిర్యాదు చేయడంతో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రంగంలోకి దిగి మార్కెట్‌లో ఆకస్మిక తనిఖీలు జరిపి మూడు గంటలపాటు విచారణ నిర్వహించారు. తనిఖీ సందర్భంలో తక్‌పట్టి నమోదు రిజిష్ట్రర్‌ను పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. నెల రోజుల క్రితం పెద్దపల్లి మార్కెట్‌లో జరిగిన కోట్ల అవినీతిపై ప్రభుత్వా నికి నివేదిక కూడా అందించినట్లు తెలిసింది. ఈ నివేదికను పరిశీలించిన సర్కారు రేపో మాపో పెద్దపల్లి మార్కెట్ అధికారులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతు న్నట్లు సమాచారం.
రైతులను ముంచుతున్నది వీరేనా ?
ఐదేళ్లకు పైగా ఇక్కడే పని చేస్తున్న సిసిఐ అధికారి, మూడే ళ్లుగా కొనసాగుతున్న మార్కెట్ కార్యదర్శిల తీరుతోనే రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారన్న విమర్శలు వినిపిస్తు న్నాయి. రైతుల ఇబ్బందులు, వారికి గిట్టుబాటు ధర కల్పిం చేందుకు పాటు పడాల్సిన సదరు అధికారులిద్దరూ అడ్తి వ్యాపారులకు వత్తాసు పలుకుంటూ రైతుల శ్రమ దోపిడీకి కారణ మవుతున్నారన్న ఆరోపణలున్నాయి. మోసానికి గుర వు తున్న రైతులు రోడ్డెక్కి ఆందోళన బాట పట్టిన ప్రతి సంద ర్భంలోనూ సదరు కార్యదర్శి మార్కెట్‌కు బంద్‌ను ప్రకటిం చ డం, సీసీఐ అధికారి సెల్ స్విచ్ఛాఫ్ చేయడం వీరి నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. మరో నెల రోజుల తర్వాత ప్రారంభ మయ్యే సీజన్‌లోనూ ఈ అధికారుల తీరు వల్ల మరింత అవినీతి జరుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.