Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

అవినీతి పార్టీలన్నీ ఓ వైపు చేరాయి: బాబు

Chandrababu-Naidu

అమరావతి: కడప ఉక్కు ఉద్యమంలో బిటెక్ రవి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఎపి సిఎం చంద్రబాబునాయుడు తెలిపారు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపించాలని సిఎం రమేశ్  దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మంత్రులు, నేతలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బాబు మీడియాతో మాట్లాడారు. ఉక్కు ఫ్యాక్టరీ అంశంలో గాలి అండ్ బృందం నాటకాలు ఆడుతున్నాయని దుయ్యబట్టారు. అగ్రిగోల్డ్ ఆస్తులు వేలం వేసి బాధితులకు న్యాయం చేస్తానని వివరించారు. అవినీతిపరులను కట్టడి చేయలేని స్థితిలో బిజెపి ఉందని మండిపడ్డారు. అవినీతి పార్టీలన్నీ ఓ వైపు చేరాయన్నారు. ఎపి వ్యాప్తంగా కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఆందోళనలు ఉధృతం చేస్తామని వివరించారు. బుధవారం సైకిల్ ర్యాలీలు, ఎల్లుండి ధర్నాలు చేస్తామని చెప్పారు. ప్రజల్లో అవగాహన పెంచి చైతన్య పరచాలని సూచించారు. గాలి జనార్ధన రెడ్డి, వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి, బిజెపిల లాలూచీ ప్రజలకు వివరించాలన్నారు.

Comments

comments