Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

పత్తి రైతులకు ‘కొత్త’కష్టం..!

ప్రత్తి తీసేందుకు కూలీల కొరత
చేన్లలో చే‘జారి’ పోతున్న ప్రత్తి పంట
చెరువులు, ఎస్‌ఆర్‌ఎస్‌పి కింద నేటికి రబీ వరి నాట్లు కొనసాగడమే కారణం..!

Cottonమంథని: ప్రత్తి రైతులకు ఎప్పుడూ లేని విధంగా కోత్త కష్టం వచ్చి పడింది. గతంలో పత్తి తీసుకునేందుకు పని కోసం కూలీలు రైతుల వద్దకు వచ్చి మరీ పని వెతుక్కోని రాగా, నేడు రబీ నాట్లు పెద్ద ఎత్తున కోనసాగుతుండటంతో ప్రత్తి రైతులు కూలీల ఇండ్లలోకి వెళ్లి తీరిగిన దొరకడం లేదు. దేవుడి పుణ్యామాంటూ భారీ వర్షాలు పడటం ఉమ్మడి జిల్లాకు సాగు నీరు అందించే ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి ప్రాజెక్టులతో పాటు జిల్లాలోని చెరువులు, కుంటలు పూర్తి స్థాయిలో నిండి జల కళతో ఉట్టి పడుతున్నాయి. మంథని డివిజన్‌లో రైతులు ఈ రబీ సీజన్‌లో రికార్డు స్థాయిలో వరి నాట్లు వేయడం జరిగింది.

గత పక్షం రోజుల క్రితమే బోరు, బావుల క్రింద వరి నాట్లు పూరైయినప్పటికినీ ఎస్సారెస్పీ నీరు వారం బంధీ పద్దతిన రావడంతో ఎస్సారెస్పీ ఆయకట్టు, చెరువులను సైతం ఎస్సారెస్పీ నీటితో ఎప్పడికప్పుడూ నింపుతుండటంతో రబీ వరి నాట్లు నేటికి కోనసాగుతున్నాయి. వరి నాట్లు ఇంకా ముగియకపోవడంతో వ్యవసాయ కూలీల కోరత తీవ్రంగా ఉంది. దీంతో ప్రత్తి తీసేందుకు రైతులకు కూలీలు దొరకడం లేదు. దీంతో చేన్లలో ప్రత్తి వీరగబూసి చేనుల్లో చే జారీ పోతుండంతో ప్రత్తి రైతులు అందోళన చెందుతున్నారు. దొరికిన కోద్దీ పాటి కూలీలతో రెండు రోజుల్లో ముగిసే ప్రత్తి తీసే పనిని పక్షం రోజుల పాటు చేనులో గడపాల్సి వస్తున్నదని రైతులు చెబుతున్నారు. మరో వారం రోజుల్లో చెరువులు, కాలువల క్రింద రబీ నాట్లు ముగిసే ఆవకాశం ఉంది.

రికార్డు స్థాయిలో యాసంగి వరి పంట సాగు..!

మంథని డివిజన్‌లో రైతులు ఈ రబీ సీజన్‌లో రికార్డు స్థాయిలో 7229 హెక్టర్లలో వరి నాట్లు వేయడం జరిగింది. మంథని మండలంలో 2846 హెక్టర్లలో, కమాన్‌పూర్ మండలంలో 1184 హెక్టర్లలో, రామగిరి మండలంలో 1012 హెక్టర్లలో, ముత్తారం మండలంలో 1890 హెక్టర్లలో వరి పంటను ఇప్పటి వరకు రైతులు సాగు చేయడం జరిగిందని మంథని ఎడిఎ విజయ్ భాస్కర్ తెలిపారు. ఇంకా చెరువులు, కుంటల క్రింద వరి నాట్లు కొనసాగుతున్నాయని, మరీంత రబీ సాగు విస్తీరణం పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

Comments

comments