Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

తెలంగాణ సర్కార్‌కు కౌంట్‌డౌన్ షురూ

uttam-kumar-reddyతెలంగాణ ఇచ్చిది సోనియాగాంధీ
టిపిసిసి రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ఎంపి అభ్యర్థి సర్వేసత్యనారాయణ

కాశిబుగ్గ: తెలంగాణ సర్కార్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభం అయిందని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం వరంగల్ మహా నగరంలోని మహేశ్వరి గార్డెన్స్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశమును నిర్వహించారు. ముఖ్యఅతిథిలుగా రాష్ట్ర అధ్యక్షులు ఉత్తమ్‌కమార్‌రెడ్డి, మాజీ మంత్రులు షబ్బీరఅలీ, వెంకటేశ్వర్లు, బస్వరాజు సారయ్య, లక్ష్మణ్‌గౌడ్, షారక్‌ఉస్సేన్, హరిరమాదేవి, పద్మ, దయాసాగర్, ఎంపి అభ్యర్థి సర్వేసత్యనారాయణలతో పాటు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరైనరు ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభం అవుతుందని అన్నారు. వరంగల్ ఉప ఎన్నికలలో ఎంపి అభ్యర్థిగా పోటి చేస్తున్నా సర్వేసత్యనారాయణ గెలువుడం వల్ల కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు కౌంట్‌డౌన్ అయిన్నట్లే  అని అన్నారు. మన ఎంపి అభ్యర్థి గెలువడం వల్ల రాష్ట్రంలోని కేసిఆర్ చేసిన మోసపూర్తిమాయిన మాటలతో పాటు అతను చేసిన అవనీతిని అంతా బయటపెట్టడంతంని అన్నారు. తెలంగాణ రాష్ట్రంను సోనియాగాంధీ ఇస్తే సిఎం కేసిఆర్ నేను తెచ్చినా అన్నాడం సరైన పద్దతి కాదుని అన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలతో పాటు వరంగల్ నగరంలోని ప్రజలను కూడా ఆయన మాటలతోనే అందరిని మోసం చేసినా వ్యక్తిని అన్నారు. అనంతరం సర్వేసత్యనారాయణ మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రం కోసం పార్ల మెంట్‌లో మాట్లాడిన వ్యక్తి నేను కేసిఆర్ తెలంగాణ బిల్లును పార్ల మెంట్‌లో పెట్టే సమయంలో అక్కడుని అన్నారు.

అంతా అయిపోయికా వచ్చి సోని యాగాంధీ కాళ్ళ మీదా పడి అమ్మా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందక వంద నాలు అన్నాడే తప్ప తెలంగాణ రాష్ట్రం కోసం ఏనాడు పార్ల మెంట్‌లో మాట్లాడాలేదని అన్నారు. అలాగే బిజేపి ప్రధానమంత్రి నంరేద్రమోడి మాత్రం తెలంగాణ రాష్ట్రం సరైన పద్దతిలో ఇవ్వాలేదని అంటున్నారు. ఈ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సరైన బుద్ధి చెప్పాలంటే ఈ వరంగల్ ఉప ఎన్నికలతో అ రెండు ప్రభుత్వలకు బుద్ధి చెప్పె ఆవకాశం వచ్చాందని అన్నారు. తప్పని సరిగా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మన కాంగ్రెస్ ప్రభుత్వ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాల్సిందిగాని అన్నారు. అనంతరం మాజీ మంత్రి సారయ్య మాట్లాడుతు వరంగల్ నగరంలో అనేక అభివృద్ధి పనులను చేసింది ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప ఎ ఇతర పార్టీలు కాదుని అన్నారు. కేంద్రనికి రాష్ట్రనికి సరైన గుణపాఠం చేప్పాంటే మనందరం కలిసి వరంగల్ ఎంపి అభ్యర్థి సర్వేసత్యనా రాయణను భారీ మోజార్టీతో గెలుపించుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో షబ్బీరఅలీ, వెంకటేశ్వర్లు, లక్ష్మణ్‌గౌడ్, హరిరమాదేవి, తదితరులు మాట్లాడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంద వినోద్‌కుమార్, బస్వరాజు కుమార్, విద్యాసాగర్, మహ్మద్, నరేందర్, సారంగపాణి, ఓని కమార్, లక్ష్మణ్, భాస్కర్, రాజు, సుధాకర్, మైనార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు పాల్గొన్నారు.

మాజీ జడ్పిచైర్‌పర్సన్ ధన్వంతి కాంగ్రెస్‌లో చేరిక
కాంగ్రెస్ పార్టీలో మాజీ జెడ్‌పిడిసి చైర్‌పర్స్‌న్ దన్వతి కాంగ్రెస్ పార్టీలో చేరింది. శనివారం నగరంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో అమె హాజరైనరు సమావేశం అనంతరం అమె కాంగ్రెస్ పార్టీలోకి రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమాక్షంలో చేరాడం జరిగింది.

Comments

comments