Home తాజా వార్తలు నోట్ల రద్దు… దేశ హితం కోసమే: దత్తాత్రేయ

నోట్ల రద్దు… దేశ హితం కోసమే: దత్తాత్రేయ

Bandaru_dattatreya

హైదరాబాద్: నోట్ల రద్దు విప్లవాత్మక చర్య అని, దేశ హితం కోసమే చేశామని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… పదేళ్లుగా ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ నల్లధనంపై ఏం మాట్లాడలేదని విమర్శించారు. నోట్ల రద్దుతో కశ్మీర్‌లో ప్రశాంత వాతావరణం నెలకొందన్నారు. దేశంలోని 49 కోట్ల మందికి త్వరలో జన్‌ధన్ ఖాతాలు ఇవ్వడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని, కార్మికులందరికీ క్యాష్ లెస్ జీతం అందాలన్నదే తమ ప్రభుత్వం ఉద్దేశమని ఆయన చెప్పారు.