Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

పెద్దలు కాదన్నారని.. ప్రేమజంట ఆత్మహత్య

Suicide-on-Train-Tracks

లక్నో: యుపిలోని బిజ్‌నోర్‌లో దారుణం జరిగింది. ఓ ప్రేమజంట తమ ప్రేమను పెద్దలు కాదన్నారని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. బిజ్‌నోర్ జిల్లా కుశలాపూర్‌కు చెందిన అలోక్ సైని, వర్ష సైని గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

అయితే వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో మనస్తాపం చెందిన ప్రేమ జంట శుక్రవారం రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనలో వర్ష అక్కడికక్కడే చనిపోయింది.

కొన ఊపిరీతో ఉన్న అలోక్‌ను ఆసుపత్రికి తరలించే క్రమంలో చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments