Home తాజా వార్తలు కారు బోల్తా: దంపతుల మృతి

కారు బోల్తా: దంపతుల మృతి

 

Road Accident

నిజామాబాద్: కారు బోల్తా పడి దంపతులు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం న్యాకతండాలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి బోల్తాపడడంతో దంపతులు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. భువనేశ్వర్ నుంచి ఆదిలాబాద్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాలను నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.

 

Couple Dead in Car Roll Over Incident in Nizamabad