Home తాజా వార్తలు పిడుగుపాటుకు దంపతులు మృతి

పిడుగుపాటుకు దంపతులు మృతి

taander

నల్లగొండ: మర్యాలగూడ మండలంలోని అలగడపలో పిడుగుపాటులకు దంపతులు మృత్యువాత పడ్డారు.శనివారం గ్రామ సమీపంలోని వ్యవసామ పొలంలో గొర్రెలను మేపుతుండగా పిడుగుపడింది. దీంతో భార్యభర్తలిద్దరూ చనిపోయారు. మృతులను ఎల్లవుల వెంకయ్య నారమ్మగా గుర్తించారు. ఈ సంఘటనతో మృతుల కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.