Home తాజా వార్తలు బైక్ ను ఢీకొట్టిన లారీ: దంపతుల మృతి

బైక్ ను ఢీకొట్టిన లారీ: దంపతుల మృతి

Two-Members-Died-in-Road-Ac

దమ్మపేట: బైక్ ను లారీ ఢీకొన్న ఘటన  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట మండలం మొద్దులగూడెం గ్రామ సమీపంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది.  దంపతులు తమ ఇద్దరు పిల్లలతో బైక్ పై వెళ్తుండగా లారీ ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ ఘటనలో దంపతులు చనిపోగా ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను దమ్మపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలం నుంచి లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.