Home తాజా వార్తలు ఎంఎల్‌ఎ కారు ఢీకొని దంపతులు మృతి

ఎంఎల్‌ఎ కారు ఢీకొని దంపతులు మృతి

Car-accident

విజయవాడ: ఎంఎల్‌ఎ కారు ఢీకొని దంపతులు మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వద్ద చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. హరినారాయణ రెడ్డి, సీతామహలక్ష్మీ అనే దంపతులు బైక్‌పై వెళ్తుండగా కందుకూరు ఎంఎల్‌ఎ రామారావు ఎస్కార్ట్ వాహనం ఢీకొట్టింది. బైక్, కారు పల్టీలు కొట్టి డివైడర్‌పై పడ్డాయి. సీతామహాలక్ష్మి ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందింది. హరినారాయణ రెడ్డి తీవ్రంగా గాయపడడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆయన చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎంఎల్‌ఎ కారు అతివేగంగా ప్రయాణించడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఎంఎల్‌ఎ విజయవాడ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.