Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

Died

దుమ్ముగూడెం : రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతిచెందిన సంఘటన మండలంలోని రేగుబల్లి గ్రామం వద్ద చోటుచేసుకుంది. వివరాల ప్రకారం చర్ల మండలం ఆర్. కొత్తగూడెం గ్రామానికి చెందిన దంపతులు సాగి రంగరాజు(50), సుభద్ర(45) కాకినాడ లో ఇంజనీరింగ్ చదువుతున్న కుమార్తేను సంక్రాంతి పండుగకు తీసుకు వచ్చేందుకు బుదవారం తెల్లవారు జామున ద్విచక్ర వాహనం పై భద్రాచలం వస్తూ దుమ్ముగూడెం మండలం రేగుబల్లి గ్రామం వద్ద భద్రాచలం నుండి చర్ల వైపు ఎదురుగా అతివేగంగా వస్తున్న ట్రాక్టర్ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీ కొట్టడంతో వారిద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. స్థానిక ఎస్సై బాలకృష్ణ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పరారీలో ఉన్నట్లు ఎస్సై తెలిపారు. మృత్యువులోను వీడని బందం అని బందువులు తలచుకుని గుండె లవిసేలా రోదిస్తున్నారు. వీరు మరణవార్త విని దుమ్మగూడెం మండల టిడిపి అధ్యక్షులు కొమరం దామోదర్‌రావు, పార్టీ కార్యవర్గం సభ్యులు రంగరాజు దంపతుల ఆత్మ శాంతి చేకూరాలని మోనం పాటించారు.

Comments

comments