Home తాజా వార్తలు సెల్‌టవర్ ఎక్కిన దంపతులు!

సెల్‌టవర్ ఎక్కిన దంపతులు!

Cellphone-Tower

యాదాద్రి భువనగిరి: భువనగిరి మండలం వీరవెల్లిలో దంపతులు సెల్‌టవర్ ఎక్కి నిరసన తెలిపారు. స్థిరాస్తి వ్యాపారి సిలివేరు నర్సింహ తమ వద్ద 42 లక్షల రూపాయలు తీసుకొని మోసగించారని దంపతులు గుత్తా సీతారామిరెడ్డి, శమంతారెడ్డి ఆరోపణలు చేశారు. తమకు న్యాయం చేయాలని సెల్‌టవర్ ఎక్కి దంపతులు నిరసన తెలుపుతున్నారు. పోలీసులు అక్కడికి చేరుకొని దంపతులను కిందకు దించడానికి ప్రయత్నిస్తున్నారు.