Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

దంపతుల ఆత్మహత్యాయత్నం

భర్త మృతి, .. భార్య పరిస్థితి విషమం

Mancheriala

మంచిర్యాలరూరల్ : కుటుంబ కలహాలతో మన స్థాపా నికి గురై కిరోసిన్ పోసుకొని దంపతులు ఆత్మహత్యాయత్నం చేసు కున్నా రు. దీనిలో భర్త మృతి చెందగా భార్య పరిస్థితి విషమంగా ఉందని పట్టణ ఎస్‌ఐ వేణుగోపాల్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం… మంచిర్యాల పట్టణంలోని శ్రీశ్రీనగర్‌లో నివాసం ఉంటున్న గోమాస దుర్గయ్య(52) గురువారం రాత్రి తాగిన మైకంలో భార్యతో గొడవకు దిగడంతో వాగ్వాదం చోటు చేసుకుందని, ఇదే క్రమంలో శుక్రవారం తెల్లవారు జామున నిద్రలో ఉన్న గోమాస లక్ష్మిపై కిరోసిన్ పోసి తాను కూడా పోసుకొని నిప్పు అంటించుకున్నాడు.

నిద్ర నుండి మేల్కొన్న లక్ష్మి భయంతో కేకలు వేస్తూ బయటకు వెళ్లడంతో చుట్టు పక్కల వారు మంటలు ఆర్పి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసు కెళ్లారు. దుర్గయ్య అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. మృతుని కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వేణుగోపాల్ తెలిపారు.

Comments

comments