Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

అటవీ అధికారుల హత్య కేసును కొట్టివేసిన కోర్టు

breaking newsతిరుపతి : 2013 డిసెంబరు 15న తిరుపతిలోని శేషాచలం అటవీ ప్రాంతంలో ఎర్రచందనం కూలీల దాడిలో అటవీశాఖ అధికారులు శ్రీధర్, డేవిడ్ కరుణాకర్ మృతి చెందారు. దీనిపై అప్పట్లో రేణిగుంట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. బుధవారం తిరుపతి మూడో అదనపు జిల్లా కోర్టులో కేసు విచారణ జరిగింది. తమిళనాడుకు చెందిన 287 మంది నిందితులు అప్పటి నుంచి కారాగారంలో ఉండగా, జిల్లాకు చెందిన 60 మంది బెయిల్‌పై ఉన్నారు. తుది తీర్పు నేపథ్యంలో బుధవారం అందరూ కోర్టుకు హాజరయ్యారు. ప్రాసిక్యూషన్ సరైన సాక్షాధారాలను చూపనందున జడ్జి పి.వి.రాంబాబు కేసును కొట్టివేస్తున్నట్టు తుది తీర్పును వెలువరించారు. ఇతర కేసులు లేకపోతే 287మందిని వెంటనే విడుదల చేయాలని పోలీసులను ఆదేశించారు.

Comments

comments