Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

మహ్మద్ షమీకి సమన్లు జారీ చేసిన కోర్టు..

Mohammed Shami Wife Hasin Jahan Meet Delhi Daredevils CEO

కోల్‌క‌తా: టీమిండియా ఫాస్ట్‌బౌల‌ర్ మహ్మద్ షమీకి చెక్‌బౌన్స్ కేసులో కోర్టు స‌మ‌న్లు జారీ చేసింది.దీంతో వ‌చ్చే సెప్టెంబ‌ర్ 22 తేదీలోగా షమీ కోర్టుకు హాజ‌రుకావాల‌ని కోర్టు స‌మ‌న్ల‌లో పేర్కొంది.  ష‌మీ గ‌తంలో తన భార్య హ‌సీన్‌కు ఇచ్చిన ల‌క్ష రూపాయ‌ల చెక్ బౌన్స్ అయిన‌ట్లు ఆమె త‌ర‌ఫు న్యాయ‌వాది పేర్కొన్నారు. షమీకి ఎంతో మందితో అక్రమ సంబంధాలు ఉన్నాయని, ఇది తెలియడంతో తనపై లైంగికదాడి చేయడమే కాక, హత్యాయత్నానికి కూడా ప్రయత్నించాడని హసీన్ సంచలన ఆరోపనలు చేసిన సంగతి తెలిసిందే. గత కేసుల సమయంలో తనకు రూ.10 లక్షలు ఇవ్వాలని హసీన్ డిమాండ్ చేసింది. అందులో 7 లక్షలు కుటుంబ నిర్వహణకు, మరో 3 లక్షలు కూతురు కోసం అని తన ఫిర్యాదులో కోరింది. మరోవైపు షమీ మాత్రం తాను నిర్దోషినని, తన భార్య, కూతురు అంటే ఎంతో ఇష్టమని, హసీన్‌తో కలిసి జీవించడానికి తనకు ఎటువంటి ఇబ్బంది లేదని పేర్కొన్నాడు. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌ కోసం ప్రకటించిన భార‌త జట్టులో మహ్మద్ షమీకి చోటు దక్కిన విషయం తెలిసిందే.

Comments

comments