Home తాజా వార్తలు మరో రెండు కేసులో చిక్కుకుపోయిన షరీఫ్

మరో రెండు కేసులో చిక్కుకుపోయిన షరీఫ్

Nawaz-Sharif

ఇస్లామాబాద్ : ఇప్పటికే పనామా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు మరిన్ని చిక్కులు ఎదురుయ్యాయి. మరో రెండు అవినీతి కేసులకు సంబంధించి అవినీతి నిరోధక న్యాయస్థానం ఆయన కుటుంబానికి నోటీసులు జారీ చేసింది. న్యాబ్ గత వారం షరీఫ్‌తో పాటు ఆయన కుమారుడు హుస్సేన్, కుమార్తె మరియం, అల్లుడు మహమ్మద్ సఫ్ధార్, మాజీ ఆర్థిక మంత్రి ఇషక్ దార్‌పై నాలుగు అవినీతి కేసులు నమోదు చేసింది. దీంతో వారంతా సెప్టెంబర్ 19లోగా తమ ఎదుట హాజరుకావాలని న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. మరోవైపు గతంలో నమోదైన అవినీతి కేసుకు సంబంధించి షరీఫ్ కుటుంబం 19వ తేదీలోగా న్యాయస్థానం ఎదుట హాజరుకావాల్సి ఉంది.