Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

‘ ఆ బిజెపి ఎంఎల్‌ఎను అరెస్టు చేయండి ’

SENGAR

అలహాబాద్ : ఉన్నావ్ అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిజెపి ఎంఎల్‌ఎ కుల్‌దీప్ సింగ్ సెంగార్‌ను తక్షణమే అరెస్టు చేయాలని శుక్రవారం అలహాబాద్ హైకోర్టు సిబిఐని ఆదేశించింది. 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినట్టు సెంగార్‌పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిపిందే. ఈ క్రమంలో యుపి ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగించింది. సిబిఐ సెంగార్‌పై మూడు కేసులు నమోదు చేసింది. శుక్రవారం ఉదయం సింగార్‌ను సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే సెంగార్‌ను విచారణ కోసమే అదుపులోకి తీసుకున్నారని, ఇంకా అరెస్టు చేయలేదని యుపి ప్రభుత్వం కౌన్సిల్ కోర్టుకు తెలియజేసింది. ఈ క్రమంలో తక్షణమే సెంగార్‌ను అరెస్టు చేయాలని కోర్టు సిబిఐ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. యుపిలోని ఉన్నావ్ జిల్లాలో 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం కేసులో సెంగార్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తనపై జరిగిన అత్యాచారంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోలేదు. దీంతో యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్ ఇంటి ఎదుట ఆమె ఆత్మహత్యాయత్నం చేయడంతో జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎంఎల్‌ఎ, బాధితరాలి బంధువుల మధ్య గొడవ జరిగింది. బాధితురాలి తండ్రిని ఎంఎల్‌ఎ సోదరుడు దారుణంగా కొట్టాడు. ఈ దాడి అనంతరం ఎంఎల్‌ఎ సోదరుడు ఆమె తండ్రిపై కేసు పెట్టాడు. ఈ క్రమంలో జైలు పాలైన బాధిత బాలిక తండ్రి మరణించారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఘటనపై యుపి సిఎం యోగి వైఖరిపై కూడా విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి.

Court Order to Arrest BJP MLA

Comments

comments