Home తాజా వార్తలు నిర్మల్ కలెక్టరేట్ ఆస్తుల జప్తు

నిర్మల్ కలెక్టరేట్ ఆస్తుల జప్తు

Nirmal-Collectorate

నిర్మల్: జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆస్తులను న్యాయస్థానం శుక్రవారం జప్తు చేసింది. జిల్లాలోని నర్సాపూర్ మండలం, బామ్ని గ్రామానికి చెందిన పలువురు రైతులు ఎస్సారెస్సీ కాలువ నిర్మాణంలో భూములు కోల్పోయారు. వారికి అప్పటి నుంచి పరిహారం చెల్లించలేదు. పరిహారం కోసం అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. దాంతో 2004లో భూములు కోల్పోయిన బాధితులు నిర్మల్ కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో సుదీర్ఘ విచారణ అనంతరం బాధితుల పరిహారం కింద కలెక్టరేట్ ఆస్తులను కోర్టుకు అటాచ్ చేసింది. ఈ మేరకు నిర్మల్ సీనియర్ సివిల్ జడ్జి సంతోష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. దాంతో న్యాయస్థానం ఆదేశానుసారం కోర్టు సిబ్బంది కలెక్టర్ కార్యాలయంలోని ఫర్నీఛర్, కంప్యూటర్లను జప్తు చేశారు.

Court orders to Confiscation of assets of Nirmal Collectorate Today.