Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

సిసి కెమెరాల సహాయంతో ఆ పాపను గుర్తించాం…

cp

హైదరాబాద్ : కోఠి ప్రభుత్వ ప్రస్తూతి దవాఖానలో అపహరించబడిన పాప కేసును సిసి పుటేజ్ ఆధారంగా చేధించగలిగామని నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిని గురువారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడారు. ప్రధాన నిందితురాలు సైనాతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశామని ఆయన తెలిపారు. ఈ కేసును ఎసిపి చేతన ఫాలోఅప్ చేశారని చెప్పారు. ఈ కేసులో సిసి కెమెరాలు ఎంతో ఉపయోగపడ్డాయని ఆయన పేర్కొన్నారు. కోఠి ఆసుపత్రి, ఎంజిబిఎస్‌లలో సిసి కెమెరాల దృశ్యాలను పరిశీలించగా కిడ్నాపర్ పాపను బీదర్ తీసుకెళ్లినట్టు గుర్తించామని చెప్పారు. బస్సు కండక్టర్ తెలిపిన సమాచారం ప్రకారం కిడ్నాపర్ బీదర్‌లో బస్ దిగినట్టు గుర్తించి అక్కడికి వెళ్లమన్నారు. బీదర్ పోలీసుల సహకారంతో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా గాలించామని తెలియజేశారు. నిందితురాలు నైనా శిశువును అక్కడి ప్రభుత్వ ఆస్పత్రిలో వదిలిపెట్టి వెళ్లిపోయిందన్నారు. శిశువును అక్కడ్నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చి,తల్లిదండ్రులకు చిన్నారిని అప్పగించాము. చిన్నారికి చేతన అని ఎసిపి చేతన నామకరణం చేశారని సిపి చెప్పారు. ఈ సందర్భంగా నగరంలోని ప్రతి వ్యాపార సంస్థ, ప్రతి కాలనీలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని సిపి  అధికారులకు సూచించారు. నేర రహిత రాష్ట్రం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Comments

comments