Home కరీంనగర్ కెసిఆర్‌ది నయా రజకార్ల పాలన

కెసిఆర్‌ది నయా రజకార్ల పాలన

cpiకరీంనగర్ టౌన్: ఆనాటి నిజాం ఆలోచనలను పైకి తేస్తూ, నయా రజాకార్ల పాలనను సిఎం కెసిఆర్ ప్రభుత్వం కొనసాగిస్తున్నదని సిపిఐ జిల్లా కార్యదర్శి కొమటిరెడ్డి రామ్‌గోపాల్ రెడ్డి ఆరోపించారు. శనివారం నగరంలోని వీక్లి మార్కెట్‌లో గల సిపిఐ మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలలో భాగంగా దొడ్డి కొమురయ్య చిత్ర పటానికి పూలమాల వేసి, సిపిఐ జెండాను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చిన, తెలంగాణకు మాత్రం 1948 సెప్టెంబరు 17న వచ్చిందని తెలిపారు. దున్నె వారికి భూమి కావాలని, గీసె వాడికి చెట్లు, వెట్టి చాకిరి రద్దు, దొరల జమీందార్ల దౌర్జన్యాలు అంతము అనే నినాదంతో సెప్టెంబరు 11న సాయుధ పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది.

దానిలో బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణ రెడ్డి, ముఖ్దుం మోషినొద్దిన్‌లు ముందు నడువగా యువతీ యువకులు, బాల బాలికలు, వృద్ధులు వేలాది మంది పలుగు, పార, రొకలి, కారం, బరిసెలు, ఆయుధంగా చేతపట్టి నిజాం రాచరిక వ్యవస్థను తరిమి కొట్టుటకు ఉద్యమించారని గుర్తు చేశారు. ఆనాడు అక్రమించుకున్న భూములు సైతం పంచి పెట్టడం జరిగిందని గుర్తు చేశారు. గత పాలకుల వలే కెసిఆర్ వ్యవహారిస్తు నియంతలాగా ఫ్యూడల్ దొరలగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ, కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ పాలనను గుర్తిస్తున్నారని, త్వరలోనే ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి కాల్వ నర్సయ యాదవ్, నగర కార్యదర్శి పైడిపల్లి రాజు, బోనగిరి మహేందర్, నలువాల సదానందం, రమేష్, మల్లేశం, నర్సయ్య, ఐలయ్య, రాజమల్లు, ఆసరి మల్లయ్య, శ్రీను, కుమార్, లింగయ్య, సంపత్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.