Home రంగారెడ్డి ఘనంగా సిపిఐ వ్యవస్థాపక దినోత్సవం

ఘనంగా సిపిఐ వ్యవస్థాపక దినోత్సవం

CPI1తాండూరు: ప్రజల కోసం గత 90 సంవత్సరాలుగా సిపిఐ పార్టీ పోరాటం చేస్తుందని తాండూరు డివిజన్ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి అన్నారు. సిపిఐ ఏర్పాటు చేసి 90 సంవ త్సరాలు పూర్తయిన సందర్బంగా వారు వార్షికోత్సవాలను జరుపుకున్నారు.ఈ సందర్బంగా పార్టీ జండా ఎగురవే శారు. జనార్దన్‌రెడ్డి మాట్లాడుతు భారత స్వాతంత్య్రోద్య మంలో సిపిఐ పోరాటం చేసిందని అన్నారు.సమసమాజ స్థాపన కోసం 1925లో సిపిఐ పార్టీని కాన్పూర్‌లో ప్రారం బించినట్లు తెలిపారు.మానవ విలువలు ఉన్న ఉద్యమ పార్టీగా ప్రజల మన్ననలను పొందిన పార్టీ సిపిఐ పార్టీఅని అన్నారు.తెలంగాణ సాయుధ పోరాటంతో పాటు సిపిఐ చేసిన పోరాటాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పోందా యని అన్నారు.కార్మికుల దుర్బర జీవితాల మార్పు కోసం అనేక విప్లవ పోరాటాలు చేసినట్లు తెలిపారు.అనేక చట్టా లను సైతం సవరించినట్లు తెలిపారు.విద్యాభివృద్ది కోసం ఆనేక పోరాటాలు చేసిన ఘనత కూడా సిపిఐకి దక్కిందని అన్నారు.విద్యార్థుల సమస్యలపై ఎఐఎస్‌ఎప్ స్థాపించి పోరాటాలు చేసినట్లు గుర్తు చేశారు.అదే విధంగా అవినీతికి వ్యతిరేఖంగా పోరాటం చేసినట్లు తెలిపారు.తాండూరు ప్రాంతంలో ఉన్ను సమస్యలపై కౌన్సిల్‌లో కూడా సిపిఐ పోరాటం చేసిందని కాగ్నా నదినుండి తరలిపోతున్న ఇసుక విషయంలో ఇంకా పోరాటం చేస్తున్నామని అన్నారు. సమస్యలపై సిపిఐ ఎల్లప్పుడు పోరాటం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ తాండూరు డివిజన్ నాయకులు శంకర్, శరణప్ప, అంజిలప్ప, గోపాల్, అన్ను మియా,అశోక్,తాండూరు పట్టణ నాయకులు మహ్మద్ సలాం,మహ్మద్ మునీర్,శాంత్ కుమార్,నర్సింహా,రాజు తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్లలో …
చేవెళ్ల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యాయని సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. ప్రభులింగం, చేవెళ్ల నియో జకవర్గం కార్యదర్శి కొజ్జెంకి రామస్వామి ఆరోపించారు. మండల పరిధిలోని మొండివాగు గ్రామంలో సిపిఐ పార్టీ జెం డాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమా వేశంలో వారు మాట్లాడుతూ.. సిపిఐ పార్టీ 90వ వార్షికోత్సవ కార్యక్రమాల్లో భాగంగా గ్రామ గ్రామాన పార్టీ జెండాలను ఆవిష్కరిస్తూ గ్రామ కమిటీలను నియమిస్తూ సిపిఐని బలో పేతం చేస్తున్నామని పేర్కొన్నారు. అదే విధంగా పార్టీ తరపునా కార్మిక సంఘాలను ఏర్పాటు చేసి వారి సమస్యల పట్ల వాటి సాధన కోసం పార్టీ నిరంతరం పోరాటం చేస్తోందన్నారు. గతంలో చేసిన పోరాటాల ద్వారానే కార్మికులకు 8 గంటల పని, కనీస వేతనాలు అందించడంతో పార్టీ కీలక పాత్ర పోషిం చిందన్నారు. దేశంలో భాజపా అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని భారత్‌కు రప్పిస్తామని హామీనిచ్చి మర్చిపోయిందని విమర్శించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్‌ను రద్దు చేసి జిల్లా ప్రజలకు సీఎం కేసిఆర్ తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. పాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్‌ను యథావిధిగా కొనసాగించి జిల్లా రైతాంగానికి, ప్రజలకు సాగు, తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కేసిఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీ లను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు తిప్పికొట్టాల్సిన అవసరముందని పిలుపు నిచ్చారు. గత 90 ఏళ్లుగా పేదల పక్షాన నిలబడి సిపిఐ పార్టీ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతుందన్నారు. కార్మిక, కర్షకుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్నది సిపిఐ పార్టీ ఒక్కటేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు సీహెచ్. సత్యనారాయణ, చేవెళ్ల సిపిఐ మండల కార్యదర్శి సుధాకర్‌గౌడ్, కార్మిక నాయకులు అంజయ్య, నర్సింలు, కృష్ణ, బాల్‌రాజ్, రాములు, ఇబ్రహీం, యూసుఫ్, గౌస్, బాలయ్య, అంతమ్మ పాల్గొన్నారు.
నేటి సమావేశాన్ని విజయవంతం చేయండి …
నేడు ఉదయం చేవెళ్ల మండల కేంద్రంలోని అంబే ద్కర్ భవన్‌లో నిర్వహించే సిపిఐ పార్టీ చేవెళ్ల నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని సిపిఐ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం కార్యదర్శి కొజ్జెంకి రామస్వామి శనివా రం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు సమా వేశం ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర, జిల్లా స్థాయి పార్టీ నాయకులు హాజరవుతారని వెల్లడించారు. నియోజకవర్గంలోని సిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి సమావేశాన్ని దిగ్విజయం చేయాలను పిలుపునిచ్చారు.
మంచాలలో
మంచాల: పేదల సమస్యలపై నిరంతరం పోరా టం చేసేదే ఎర్ర జెండా అని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కావలి నర్సింహ్మ, మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు అన్నారు.
శనివారం మంచాల మండలకేంద్రంలో సిపిఐ 90వ వార్షికోత్సవం సందర్బంగా పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్బంగా వారు మాట్లా డుతూ కమ్యూనిస్టు పార్టీ 1925 డిసెంబర్ 26న కాన్పూర్‌లో స్థాపించడం జరిగిం దని 90 సంవత్స రాలుగా సిపిఐ మహిళా ప్రజాసంఘాలు పార్టీ పేద బడుగు, బలహీన వర్గాలు, కార్మిక కర్షక, యువ జన, విద్యార్థి సంఘాలు నిర్వహించి వారిని చైతన్యం చేసి వారి హక్కులను కాపాడిందనిఅన్నారు. ప్రభుత్వం ఎన్నికల ముందు చేసిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను గ్రామాలలో నిర్మించాలని మంచాల మండలంలో తలపెట్టిన మైనింగ్ జోన్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని లేనిపక్షంలో 2016 సంవత్స రాన్ని పోరాటల సంవత్సరంగా నామకరణం చేయాల్సి ఉంటుందని హేచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి నర్ల శ్రీశైలం యాదవ్, మహిళా సంఘం నాయకురాలు ఆకుల చంద్రకళ, జిల్లా అధ్య క్షురాలు పి నీళమ్మ, మణేమ్మ, ఎఐయస్‌ఎఫ్ నాయకులు ఆనంద్ కుమార్, స్వరాజ్యం పాల్గొన్నారు.
షాబాద్‌లో …
షాబాద్: ప్రతి పల్లెలో సిపిఐ జెండా ఎగర వేయాలని జిల్లా కార్యవర్గ సభ్యులు పాలమాకుల జంగయ్య అన్నారు. శనివారం షాబాద్ మండల కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ 90వ వ్యవస్థాపక వార్షికోత్సవాలలో భాగంగా షాబాద్, నాగర్‌కుంట, కుర్వగూడ గ్రామాలల్లో సిపిఐ జెం డాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ప్రతి పల్లెలో సిపిఐ జెండాను ఎగరవేసి పేద ప్రజల హక్కుల కోసం పోరాటాలు చేస్తామన్నారు. సిపిఐ పార్టీని కార్యకర్తలు అన్ని గ్రామాలకు విస్తరించి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కరువు విలయతాండవం ఆడుతుంటే కేసిఆర్ మాత్రం యాగాల పేరుతో కాలం గడుపుతున్నారు. రైతు లకు పంటనష్ట పరిహారం అన్ని పంటలకు ఇవ్వాలని ప్రభు త్వానికి విజ్ఞప్తి చేశారు. రాబోయో రోజుల్లో కమ్యూని ష్టులను ఐక్యం చేసి ప్రజ సమస్యలపై ఐక్య ఉద్యమం నిర్వహిస్తామ న్నారు. చేవెళ్ల నియోజకవర్గ కార్యదర్శి రామ స్వామి, షాబాద్ మండల కార్యదర్శి నాగుల జంగయ్య, ఎఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు సత్యనారా యణ,ఉపాధ్యక్షులు ఆంజనేయులు, సిపిఐ నాయ కులు సుదాకర్‌గౌడ్, కృష్ణ, రుక్కయ్య, రాములు, రామకృష్ణ, జనార్ధన్, నర్సింలు, ఆం జనేయులు, శేఖర్, జంగయ్య పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంలో …
ఇబ్రహీంపట్నం టౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యేలు కొండిగారి రాములు, మస్కు నర్సింహా, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కావలి నర్సింహ, మహిళా సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆకుల చంద్రకళలు డిమాండ్ చేశారు. సిపిఐ 90వ వార్షికోత్సవాన్ని పురస్కరిం చుకొని మండల కేంద్రంలో పార్టీ జెండాను ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమ స్యల పరిష్కారం కోసం సిపిఐ ఆవిర్భావం నుండి కృషి చేసిందని చెప్పారు. రానున్న రోజుల్లోనూ ప్రజలు ఎదు ర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలపై సమరశంఖాన్ని పూరిస్తుందని అన్నారు.వ్య.కా.స. జిల్లా ఉపాధ్యక్షులు శివరాల లక్ష్మయ్య, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నీలమ్మ, నాయకులు విజయ్ కుమార్, భవా ని కిషన్, శ్రీశైలం, జనార్ధన్, ఎంఎస్ కుమార్, వెంకటయ్య, పాపయ్య, నర్ల స్వరాజ్యం, నర్సింహ పాల్గొన్నారు.