Home భద్రాద్రి కొత్తగూడెం దేశంలో ప్రమాద ఘంటికలు

దేశంలో ప్రమాద ఘంటికలు

CPI fight from all corners to protect the country

 మోడీది నియంతృత్వపోకడ                                                                                                                                   దేశ పరిరక్షణకు నలుమూలల నుండి సిపిఐ పోరాటం                                                                                               కెసిఆర్‌ది దొంగాట డా..కె.నారాయణ  

మనతెలంగాణ/ భద్రాద్రి కొత్తగూడెం: ఎన్నడూ లేని విధంగా దేశంలో ప్రమాదఘంటికలు మోగనున్నాయని, బీజేపి నేతృత్వంలో మోడి సర్కార్ నియంతృత్వ పోకడలకుపోతూ ఆర్‌ఎస్‌ఎస్, గోసంరక్షణ సమితీల విధానాలను దేశ ప్రజలపై రు ద్దుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, పవిత్ర భారతదేశాన్ని రక్షించుకునేం దు సిపిఐ దేశ నలుమూలల నుండి దేశాన్ని కాపాడండీ-రాజ్యాంగాన్ని కాపాడండీ అ నే నినాదంతో రాబోయే రోజుల్లో పోరాటం చేయబోతోందని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. స్థానిక శేషగిరి భవన్‌లో ఆదివారం  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  దేశ రక్షణకు, రాజ్యాంగస్పూర్తి కే కేవలం బిజేపి వల్ల మాత్రమే ప్రమాదం పొంచి ఉందన్నారు. దేశ అధ్యక్ష భవనాన్ని, ఎ న్నికల సంఘాన్ని, సిబిఐ, నీతి ఆయోగ్‌లను తన చెప్పు చేతల్లో పెట్టుకుని పెత్తనం సాగిస్తున్నారని మండిపడ్డారు. అనుకూలవాద రాజకీయాలకు తెరలేపుతూ హిందుత్వాన్ని రెచ్చగొడుతూ టెట్రరిజాన్ని , వ్యతిరేక శక్తులకు అవకాశాలు కల్పిస్తూ  రాజ్యాంగ స్పూర్తిని అపహాస్యం చేస్తున్నారని అన్నారు. స్వయంగా సుప్రీంకోర్టున్యాయమూర్తులే దేశాన్ని రక్షించుకోండీ అంటూ చెప్పారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో కేసిఆర్ కేంద్ర ప్రభుత్వవిధానాలకు తలొగ్గుతున్నారని, ఇక్కడ బిజేపిని, మోడిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి తీరా ఢిల్లీకి వెళ్లిన తర్వాత మోకరిల్లుతు దొంగాట ఆడుతున్నారని అన్నారు. అసలు కేంద్రప్రభుత్వంపై కేసిఆర్ వైఖరి ఎంటో ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులను అడక్కుండా నీళ్లు నములుతున్నారని మండిపడ్డారు. సాక్షాత్తూ అసెంబ్లీలో తీర్మాణం చేసిన ముస్లీం రిజర్వేషన్, ఎస్సి, ఎస్టి వర్గీకరణ, నియోజకవర్గాల పెంపును ఆమోదించుకోలేక పోవడం, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధించుకోలేక పోవడం కేసిఆర్ చేతగాని తనానికి నిదర్శనం అని, కేవలం తన కూతురు ఎంపి ఉద్యోగాన్ని కాపాడుకోవడం కోసమే ఉన్నారని, దాని కంటే రాజీనామా చేస్తే హుందాతనంగా ఉంటుందని హితవు పలికారు. ఏ లక్షంతో తెలంగాణ సాధించుకున్నామో కేసిఆర్ వల్ల ఆ విధానం నీరుగారిపోతోందన, తెలంగాణ మలిదశపోరాట సమయంలో తెలంగాణా వాదలను తరమికొట్టిన వారిని చంత నెక్కించుకుంటున్నార, సమైఖ్యావాదులు, తెలంగాణద్రోహులకు ఈ రోజు క్యాబినేట్‌లో పదవులు కట్టబెట్టి, తెలంగాణ వాదులను ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని యద్దేవాచేశారు. 1500 మంది యువకిషోరాల బలిదానాలతో వచ్చిన తెలంగాణ ఆత్మఘోషిస్తోందని అన్నారు. బిజేపి,టిఆర్‌ఎస్ పార్టీల నుండి ప్రజలను రక్షించుకునేందుకు సిపిఐ త్వరలో శ్రీకారం చుట్టుబోతోందని తెలిపారు.ఈ విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, సిపిఐరాష్ట్రసహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య, నాయకులు బందెల నర్సయ్య, గుత్తుల సత్యనారాయణ, ముత్యాల విశ్వనాధం, కె. సారయ్య, బోళ్ల సూర్యం,  నరాటి ప్రసాద్, దుర్గరాశి వెంకన్న,  వై శ్రీనివాసరెడ్డి,తదితరులు పాల్గొన్నారు