Home మంచిర్యాల పార్టీ బలోపేతానికి కృషి

పార్టీ బలోపేతానికి కృషి

Gunda-Mallesh 

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు గుండా మల్లేష్

మనతెలంగాణ/మంచిర్యాలఅర్బన్: మంచిర్యాల జిల్లాలో సిపిఐ పార్టీని, ప్రజా సంఘాలను బలోపేతం చేయుటకు కార్యకర్తలు నాయకులు కృషి చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎంఎల్‌ఏ గుండా మల్లేష్ పిలుపు నిచ్చారు. మంగళవారం మంచిర్యాలలోని పార్టీ  కార్యాలయంలో సిపిఐ నాయకుడు సిహెచ్.లింగమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సభ్యుల, మండల కార్యదర్వుల సమావే శానికి ముఖ్యఅతిధిగా గుండా మల్లేష్ పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని అన్ని మండలాలలో పార్టీ శాఖలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ప్రతి మండలంలోని గ్రామ శాఖలు, ప్రజాసంఘాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.

పిబ్రవరి నెలంత గడప గడపకు సిపిఐ అనే నినాదంతో మాస్ ఫండ్ క్యాంపెనింగ్ చేయాలని, తద్వార హోల్ టైమర్లను నియమించుకోవాలని ఆయన ఆదేశించారు. అనంతరం జిల్లా కార్యదర్శి కలవేణశంకర్ మాట్లాడుతూ పిబ్రవరి 3వ తేదీ నుండి మంచిర్యాల పట్టణంలో గడపగడపకు సిపిఐ అనే నినాదంతో మాస్ ఫండ్ క్యాంపినింగ్ నిర్వహిస్తామని, ప్రచారంలో రాష్ట్ర సమితి సభ్యులు. జిల్లా సమితి సభ్యులు పాల్గొంటారని, ఈ కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలన్నారు. అంతకుముందు సిపిఐ పార్టీలో సుధీర్ఘ కాలంగా పని చేసి ఇటీవల మరణించిన కామ్రేడ్ పోతుగంటి శేషగిరి రావు స్వాతంత్య్ర సమరయోధుడు కామ్రేడ్ శివయ్యల మృతికి కలవేణ శ్యాం సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా మౌనం పాటించి, నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.