Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

కెసిఆర్‌కు సిపిఐ నారాయణ సవాల్…

CPI-NARAYANA
సిద్ధిపేట: ప్రధాని మోడీ, సిఎం కెసిఆర్ ప్రజాస్వామ్యాన్నితప్పుదోవ పట్టిస్తున్నారని సిపిఐ నేత నారాయణ విమర్శలు గుప్పించారు. విభజన చట్టం హామీలపై మోడీని కెసిఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. మోడీ, కెసిఆర్ మధ్య రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని ఆయన ఆరోపించారు. హుస్నాబాద్‌లో శనివారం సిపిఐ నియోజకవర్గాస్థాయి కార్యకర్తల సమావేశాన్నినిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ నేతలు నారాయణ, చాడ వెంకట్ రెడ్డి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ… టిఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో సగం హామీలు నెరవేర్చినా.. సిఎం కెసిఆర్ కాళ్లు కడిగి నెత్తిమీద పోసుకుంటామని నారాయణ వ్యాఖ్యానించారు. లేకుంటే కెసిఆర్ ముక్కు నేలకు రాయడానికి సిద్ధమా..?అని ఆయన ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో హుస్నాబాద్‌లో సిపిఐ జెండా ఎగురుతుందని చాడ వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై గ్రామ గ్రామాన ప్రజా ఉద్యమాలు చేస్తామని చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.

Comments

comments