Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

సాయుధ పోరాట యోధుల స్ఫూర్తితో ఉద్యమిద్దాం

సిపిఐ నేత విశ్వేశ్వరరావు

Thorur

తొర్రూరు రూరల్: భూమి కోసం, భుక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం జరిగి న తెలంగాణ సాయుధ పోరాట యోధుల స్పూర్తితో ప్రజల సమస్యలపై ఉద్యమించాల్సిన అవసరం ఉందని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, రైతు సంఘం రాష్ట్ర సంఘం అధ్యక్షులు తమ్మెర విశ్వేశ్వరరావు అన్నారు. మండలంలోని అమ్మా పురం గ్రామంలో సాయుధ పోరాట యోధుడు కొత్తూరి నర్సయ్య సంతాపసభకు గ్రామశాఖ కార్యదర్శి బూరుగు యాదగిరి అధ్యక్షత వహించగా ఆయన ముఖ్య అథిదిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో జన్మించిన నర్సయ్య గ్రామంలోని సిపిఐ ఉద్యమకారులు వెంకట్రాంనర్సయ్య, పి. వీరభద్రం నాయకత్వంలో జరిగిన నైజాం నవాబు దొరలు, జాగీర్‌దార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరులో అగ్రభాగాన నిలిచాడని ఆయన అన్నారు.

నిరుపేదల సమస్యలు పరిష్కారం చేసే వరకు మొక్కవోని దైర్యంతో ముందుకు సాగిన మహానాయకుల ఆశయాలను నేటితరం కార్యకర్తలు ఉద్యమాలకు సన్నద్దం కావలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. గ్రామంలోని కొలిపాక సాయన్న, గూడెల్లి ఎల్లయ్య, గుంటుక అయిలయ్య, జనగం సోమయ్య, గూడెల్లి రామచంద్రు, డొనుక ఎల్లయ్య, పంజాల రామస్వామి, బొల్లం వెంకటయ్య, దొనుక ఎల్లయ్య, రాములు, ముడుపు రాంరెడ్డి, వడ్డెపెల్లి సాయిలు, గాజరబోయిన కొమురయ్యలు నైజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆదర్శ కమ్యూనిస్టులుగా నిలిచారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రజా సమస్యలను పరిష్కారం చేస్తామని చెప్పి గాలికి వదిలారని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఉద్యమాలే శరణ్యమని ఆయన అన్నారు. ఈసమావేశంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమాక్రసీ నాయకులు కొత్తపల్లి రవి, ఎంసిపిఐ యు రాష్ట్ర నాయకులు గుగులోతు నానూ నాయక్, ఎఐటియుసి మహబాదు జిల్లా అధ్యక్షులు ఓమ బిక్షపతి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ముద్దం మహబూబ్‌రెడ్డి, సిపిఐ మండల కార్యదర్శి గట్టు శ్రీమన్నారాయణ, సిపిఎం నాయకులు మేకల కుమార్, గ్రామ సర్పంచ్ మామిండ్లపల్లి రమేష్, గుంటుక బిక్షం కొత్తూరి రాజు, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments