Home మంచిర్యాల తెలంగాణ దొరల చేతిలో బందీ

తెలంగాణ దొరల చేతిలో బందీ

CPI-Leader

సిపిఐ జిల్లా కార్యదర్శి కలవేణ శంకర్
నస్పూర్: తెలంగాణ రాష్ట్రం దొరల చేతిలో బందీ అయిందని సిపిఐ జిల్లా కార్యదర్శి కలవేణ శంకర్ పేర్కొన్నారు. ఆంధ్రా కబంధ హస్తాల నుండి విముక్తి కోసం అనేక ఉద్యమాలు, పోరాటాలు ప్రాణాలు అర్పించి సాధించుకున్న తెలంగాణ దొరల చేతిలో బంది అయిందన్నారు. శుక్రవారం తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా నస్పూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో నస్పూర్ సెంటర్‌లో సిపిఐ మండల కార్యదర్శి జోగుల మల్లయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి హజరై ప్రసంగించారు.

రాష్ట్ర ప్రభుత్వం మూడు సంవత్సరాల కాలంలో హామీలు , ప్రలోబాలు తప్పా చేసింది ఏమిలేదని, తెలంగాణ ద్రోహులకు మంత్రి పదవులు ఇచ్చి అందలం ఎక్కించడాన్ని తప్పుపట్టారు. దొరల తెలంగాణ నుండి వియుక్తి కోసం భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పోరడానికి ప్రతి కార్యకర్త సైనికుళ్ల పని చేయాలన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కలవేణ కుమా రస్వామి, మండల ప్రధాన సహయ కార్యదర్శి డాక్టర్ శంకర్, నస్పూర్ గ్రామ కా ర్యదర్శి రాజేశ్వర్‌రావు, సహయ కార్యదర్శి లింగం రవి, నాయకులు జోగుల ఆం జనేయులు నర్సింగ్, కాంపల్లి నర్సయ్య, కొట్టె శంకరయ్య, మల్లేష్, సమ్మిరెడ్డి, పో షం, నూకల రాజయ్య, గాధాసు రాజు, తదితరులు పాల్గొన్నారు.