Home మహబూబాబాద్ భూసేకరణ చట్టాన్ని ఎత్తివేయాలని డిమాండ్

భూసేకరణ చట్టాన్ని ఎత్తివేయాలని డిమాండ్

CPIML Fight on  Land acquisition law

తొర్రూరు: 2013 భూసేకరణ చట్టాన్ని సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రానున్న 2016 భూసేకరణ చట్టాన్ని ఉపసంహరించుకొని వెంటనే ఎత్తివేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమాక్రసీ డివిజన్ కార్యదర్శి ముంజంపెల్లి వీరన్న అన్నారు. మండల కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో 2016 భూసేకరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తహశీల్దారు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.

అనంతరం వారు వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం కెసిఆర్ ప్రతిపాదించిన నూతన భూసేకరణ చట్టం బడా పారిశ్రామిక వేత్తలకు, బహుళజాతి కంపెనీలకు లబ్దిచేకూరే విధంగా ఉందన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆచట్టాన్ని ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళన కార్యక్రమాలను చేపడుతామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో నాయకులు తండా సురేష్, బిక్కూ, రవి, ఎల్లయ్య, వెంకటయ్య, మధు, ప్రవీన్, రాజు, మహేష్, తదితరులు పాల్గొన్నారు.