Home యాదాద్రి భువనగిరి పెట్రోల్ ధరలను తగ్గించాలి: సిపిఎం నాయకులు

పెట్రోల్ ధరలను తగ్గించాలి: సిపిఎం నాయకులు

CPM Leaders Demand Decrease Petrol price

చౌటుప్పల్ : పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టి.మాస్ చైర్మన్ దాసరి అంజయ్య ఆరోపించారు. పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ నాయకులు మంగళవారం వినూత్న రీతిలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పెట్రోలు ధరలు భారంగా మారాయని పేర్కొంటూ మోటారు సైకిల్‌కు తాళ్లు కట్టి లాగుతూ జాతీయ రహదారి వెంట నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి అంజయ్య మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పూర్తిగా తగ్గిపోయినా కేంద్రం ఏమాత్రం పెట్రోలు ధరలు తగ్గించకపోవడం చాలా దారునమని విమర్శించారు. కేంద్రం టాక్స్, రూ. 32లు, రాష్ట్ర టాక్స్ రూ. 22లు జిఎస్‌టి విధిస్తూ పెట్రోలు ధరలు తగ్గించక పోవడం సామాన్య ప్రజలకు చాలా ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బత్తుల శ్రీశైలం, రాగీరు కిష్టయ్య, బత్తుల దాసు, బండారు నర్సింహా, పి. నాగరాజురెడ్డి, ఆదిమూలం నందీశ్వర్, బావండ్లపల్లి స్వామి, చిలుకూరు లక్ష్మినారాయణ, ఏనుగు రంగారెడ్డి, ఎర్ర ఊశయ్య, జెనిగల మల్లేశం, ఎర్రంశెట్టి ప్రసాద్, చీమకండ్ల శ్రీరాములు, జక్కిడి గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.