Search
Sunday 23 September 2018
  • :
  • :

మోడీ ధుర్యోధనుడు.. అమిత్ షా దుశ్శాసనుడు : ఏచూరి

Cpm-party-meeting

హైదరాబాద్: వామపక్ష ప్రజాతంత్ర ప్రత్యామ్నాయం కోసం అభ్యుదయ సామాజిక శక్తులన్నీ ఒక్కటి కావాలనే నినాదంతో సిపిఎం 22వ మహాసభల, బహిరంగ సభ ఆదివారం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైంది. ఈ సభకు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరితో పాటు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, జాతీయ నేతలు ప్రకాష్ కారాట్, బివి రాఘవులు, తమ్మినేని సీతారం, పి.మధుతో పాటు పలువురు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు సభకు వచ్చారు. సభా వేదిక మీద కళాకారల ఆలపించిన విప్లవగేయాలు అందరిని ఆకట్టుకున్నాయి. మలక్ పేట్ టివి టవర్ నుంచి సరూర్ నగర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. సరూర్ నగర్ మైదానమంతా ఎర్ర జెండాలతో రెపరెపలాడింది. ఈ సందర్భంగా  సీతారం ఏచూరి మాట్లాడుతూ.. తెలంగాణ గడ్డమీద ఎర్రజెండా ఎగిరే రోజు వస్తుందని ఆయన తెలిపారు. దేశంలో ఆర్థిక దోపిడి పెరిగిపోతోందని, మోడీ ప్రభుత్వం వచ్చాక సమస్యలు మరింత పెరిగాయన్నారు. పెట్టుబడిదారులకే మోడీ సర్కార్ రుణమాఫీ చేస్తోందని,  మోడీ ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఆయన ద్వజమెత్తారు. నీరవ్ మోడీ, లలిత్ మోడీ, మన ప్రధాని నరేంద్రమోడీ.. అందరూ లూటీ చేసే మోడీలేనని  ఏద్దేవా చేశారు. దేశంలో దౌర్జన్యాలు చేసేవారంతా బిజెపి, ఆర్ ఎస్ ఎస్ వాళ్లేనని ఏచూరి నిప్పులు చెరిగారు. ఎన్ని దారుణాలు చేసిన వాళ్లపై కేసుటుండవు కానీ బాధితులపై కేసులు పెడతారన్నారని ఏచూరి మండిపడ్డారు. గోరక్షణ పేరుతో దళితులు, ముస్లింపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి కౌరవ సైన్యంలో మోడీ ధుర్యోధనుడు అయితే అమిత్ షా దుశ్శాసనుడని ఏచూరి పేర్కొన్నారు.

Comments

comments