Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

వైసిపి ఎంపిల దీక్షకు సిపిఎం మద్దతు

YSR-Congress-Party

ఢిల్లీ: ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైసిపి ఎంపిలు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష శనివారంతో రెండో రోజుకు చేరుకుంది. వైసిపి ఎంపి దీక్షకు సిపిఎం మద్దతు తెలిపింది. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి దీక్షా స్థలికి వచ్చి మద్దతు తెలిపారు. దీక్ష చేస్తున్న ఎంపిలతో పాటు కొంచెం సేపు దీక్షలో ఆయన కూర్చున్నారు.  ఐదుగురు వైఎస్‌ఆర్‌సిపి ఎంపిలకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. రామ్‌ మనోహర్ లోహియా ఆస్పత్రి వైద్యులు వైసిపి ఎంపిలకు వైద్య పరీక్షలు చేశారు. ఎంపిల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

Comments

comments